Home Unknown facts పాకిస్థాన్ ఆర్మీని వణికించిన తనోట్ మాత ఆలయ విశేషాలు

పాకిస్థాన్ ఆర్మీని వణికించిన తనోట్ మాత ఆలయ విశేషాలు

0

భారతదేశంలో ఎన్నో పురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఎందుకంటే పాకిస్థాన్ జనరల్ ఇక్కడ దేవి మహిమలను చూసి తలవంచి నమస్కారం చేసాడు. రెండు సార్లు పాకిస్థాన్ ఆర్మీ బోర్డర్ నుండి లోనికి వచ్చి యుద్ధం చేయగా వారిని ఈ దేవియే తరిమికొట్టింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నపటికీ పాకిస్థాన్ వణికిపోవడానికి ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే అని చెప్పడానికి ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయాన్ని టార్గెట్ చేసిన పాకిస్థాన్ వారికీ అమ్మవారు ఎలాంటి బుద్ది చెప్పారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tanot Mata Mandir

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ జిల్లాలో 150 కిలోమీటర్ల దూరంలో తనోట అనే గ్రామంలో తనోట మాత ఆలయం ఉంది. 1920 వ సంవత్సరంలో ఇక్కడి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరిగిందని చెబుతారు. అయితే రాజస్థాన్ లో పాకిస్థాన్ తో మన సరిహద్దు దాదాపుగా 100 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. ఇక విషయంలోకి వెళితే దాదాపుగా 50 సంవత్సరాల క్రితం భారతదేశానికి చైనాకి యుద్ధం జరుగగా ఆ యుద్ధం తరువాత భారత్ ఆర్థికంగా చాలా వెనుకబడిఉంది. ఈ యుద్ధం జరిగిన ఒక మూడు నెలల తరువాత ఇదే సరైన సమయం అని భావించిన పాకిస్థాన్ రాజస్థాన్ లోని తనోట గ్రామాన్ని టార్గెట్ చేసి తనోట్ మాత ఆలయ ప్రాంతంలో ముందు 400 పైగా బాబులను వేసింది. ఇక అప్పుడే పాకిస్థాన్ ఆర్మీకి అంతు పట్టని ఆశ్చర్యం కలిగింది. కొన్ని వందల బాంబులను వేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఒక్క బాంబు కూడా పేలలేదు. ఇలా బాంబులు పేలకుండా చేసే శక్తి మనుషులకు ఉండదని ఆ ప్రాంతంలో ఉన్న తనోట్ మాత శక్తి వలనే బాంబులు పేలలేదనే విషయాన్నీ వారు అర్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ఓటమిని అంగీకరించిన పాకిస్థాన్ జనరల్ ఈ మాత ఆలయానికి వచ్చి ఆశీర్వాదాన్ని కూడా తీసుకున్నారు.

ఆ సమయంలోనే మనిషి ఊహకి అందని శక్తి ఏదో ఈ విశ్వంలో ఉందని చాలా మంది భావించారు. ఇక ఇది జరిగిన కొన్ని నెలల తరువాత ఈ ప్రాంతంలో కేవలం ఒక బెటాలియన్ మాత్రమే ఉండగా అది తెలుసుకున్న పాకిస్థాన్ ఆర్మీ 2000 మంది సైన్యంతో 90 కి పైగా యుద్ధ ట్యాంకులతో బార్డర్ నుండి లోనికి వచ్చి దాడికి పాల్పడాలని చూడగా ఒక్కసారిగా పాక్ ఆర్మీలో అందులోనే ఎందుకంటే ఆ యుద్ధ ట్యాంకులు ఒక్కసారిగా ఆగిపోయాయి. వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ అవి కొంచం కూడా కదలకుండా అలానే ఉండిపోయాయి. ఆ సమయంలో భారత్ హండర్ విమానాలతో ఆ ట్యాంకులను ధ్వంసం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ ఈ ఆలయం దగ్గర ప్రయోగించిన బాంబులు పేలకుండా పడిపోగా వాటిని సాక్ష్యంగా ఇప్పటికి ఈ ఆలయంలో ఉన్న ఒక మ్యూజియంలో మనం వాటిని చూడవచ్చు. ఇలా తనోట్ మాత అనుగ్రహం కారణంగానే యుద్ధ ట్యాంకులు అని కూడా ఆగిపోయాయని సైనికులు నమ్మగా అప్పటినుండి ఈ మాత ఆలయం అద్భుతం ఏంటనేది అందరికి తెలియడం మొదలయింది.

ఇక పాకిస్థాన్ తో ఈ రెండు యుద్దాలు జరిగిన తరువాత BSF ఏర్పడింది. BSF కి బోర్డర్ రక్షించే బాధ్యతలను భారత ప్రభుత్వం అప్పగించింది. ఇంకా ఈ ఆలయ బాధ్యతలను కూడా BSF వారే తీసుకున్నారు. ఇక జవాన్లు ఎలాంటి ఆపరేషన్స్ మొదలుపెట్టిన ముందుగా ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ మాత ఆశీర్వాదాన్ని తీసుకున్నాక ఆపరేషన్స్ మొదలుపెడతారు. ఎన్నో అద్భుతాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఇక్కడ కొలువైన ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక కొత్త వాహనాలు కొన్నవారు ఈ ఆలయం దగ్గర ఉన్న ఇసుకని వాహనానికి బొట్టు లాగా పెట్టి పూజలను చేస్తుంటారు.

ఇక ఒకవైపు దైవభక్తి, మరొక వైపు దేశభక్తి రెండు ఒకేదగ్గర ఉన్న ఈ ప్రాంతంలోని అమ్మవారి చల్లని చూపు వారిపైన ఉంటుందని శత్రువు వారిని ఏమి చేయలేడనే ఒక నమ్మకం ఇక్కడి జవాన్లలో ఉంటుంది.

Exit mobile version