Home Unknown facts తేత్రాయుగం నాటి శివలింగం ఉన్న అతి ప్రాచీన వైకోమ్ మహాదేవ ఆలయం

తేత్రాయుగం నాటి శివలింగం ఉన్న అతి ప్రాచీన వైకోమ్ మహాదేవ ఆలయం

0

మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉండగా తేత్రాయుగం నాటిదిగా చెప్పే ఈ శివాలయం ఎంతో మహిమగల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడు మూడు రూపాలలో దర్శనం ఇస్తుంటాడు. మరి ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? శివుడిని అన్నదాన దేవుడిగా ఎందుకు కొలుస్తారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vaikom Shri Mahadeva Temple In Kerala

కేరళ రాష్ట్రం, కొట్టాయం జిల్లాలో వైకోమ్ ప్రాంతంలో వైకోమ్ మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయం అతిపురాతన మహిమగల శివాలయంగా ప్రసిద్ధిచెందినది. ఇక్కడి స్వామిని వైకతప్పన్ అని భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడి శివలింగం తేత్రాయుగం నాటిదిగా చెబుతారు. ఈ స్వామిని అన్నదాన ప్రభువుగా, కరుణ స్వరూప అంటూ భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం విశేషం ఏంటంటే పూర్వమే ఈ ఆలయానికి ఏ మతవారైనా, ఏ కులం వారైనా రావొచ్చు అనేది ఉంది. ఇక్కడ ఎలాంటి తారతమ్యాలు ఉండవు.

ఇక పురాణానికి వస్తే, పూర్వం ఇక్కడి ఆలయ ప్రదేశంలో స్వామివారు నీటిలో ఉండగా ఈ దారిగుండా వెళుతున్న పరశురాముడు అందులో నుండి వస్తున్న వెలుగును చూసి ఈ స్వామికి గుడికట్టించి పూజలు చేసాడట. ఈ ఆలయంలో పరశురాముడు ఏర్పరిచిన కొన్ని పూజావిధానాల ప్రకారం ఉదయం దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం కిరాతమూర్తిగా, సాయంత్రం సచ్చితానంద మూర్తిగాను కొలుస్తారు. అభిషేక ప్రియుడైన శివుడికి ఇక్కడ ప్రతినిత్యం సహస్రకలభిషేకం జరిపిస్తారు.

ఇక్కడ స్వామివారికి రెండు వర్గాల పూజారులు పూజలు చేయడం విశేషం. ఇందుకు కారణం ఏంటంటే, సుమారు 500 సంవత్సరాల క్రితం ఈ ఆలయం లో మంటలు చెలరేగగా ఆ ఆలయ పూజారి గర్గుడిలోకి వెళ్లి శివలింగానికి రాగిపాత్ర కప్పి శివలింగాన్ని కౌగిలించుకొని అలానే ఉండిపోగా ఒక 12 రోజుల తరువాత ఆలయం లో మంటలు ఆరిపోగా గర్భగుడిలో ఉన్న ఆ పూజారిని అప్పుడు బయటకి తీసుకువచ్చారు. ఇలా బయటకి వచ్చిన ఆ పూజారి ఇప్పటినుండి నాలాగా ఇక్కడ ఎవరు కష్టపడకుండా ఉండకూడదు ఇకపైనుండి నా వంశం వారు ఎవరు కూడా కష్టపడదు అని వంశపారంపర్యంగా వస్తున్న పూజారి బాధ్యతలను వదిలేసాడు.

శివాలయంలో మంటలు వచ్చినప్పటికి తనని రక్షించిన ఆ పూజారి తన బాధ్యతలను వదిలివేయడం చూసిన శివుడికి ఆగ్రహం వచ్చినది. ఇకపైనుండి వారి వంశంలో మగసంతానం లేకుండాపోవుగాక అని శపించాడు. ఆ తరువాత మరొక వంశం వారు ఆలయ పూజారి బాధ్యతలను చేపట్టింది. ఇక ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలలో మద్యలను వాయించే వారు ఉచితంగా ఉత్సవాలలో వాయించడానికి ఇష్టపడలేదు. అయితే ఆ కుటుంబంలోని శివభక్తురాలైన ఒక నిండు గర్భిణీ తన వంశంలో ఉండే పురుషులు మద్దెలు వాయించడం లేదని దుఃఖిస్తూ తానే వెళ్లి వాయిస్తానని వెళ్లి ఆలయంలో వాయించడం కోసం సిద్ధమవుతుండగా ఆమె భక్తిని చూసి ముగ్దుడైన శివుడూ ఆమెముందు ప్రత్యేక్షమై ని కడుపులో మగశిశువు ఉన్నాడు వాడు వాడి వారసులు నా ఉత్సవాలలో మద్దెలను వాయిస్తారు విచారించకు అని చెప్పాడు.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడికి వచ్చే భక్తులు ప్రసాదంగా అన్నం పెడతారు. ఈ ప్రసాదం తింటే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని, శివుడు కూడా తమతో కలసి భోజనం చేస్తాడని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయంలో వెలసిన మహాదేవుడికి కార్తీకమాసంలో ప్రత్యేక పూజలకు దూరప్రాంతాల నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు.

Exit mobile version