Home Health పొట్ట దగ్గర కొవ్వు కరిగించడానికి కొబ్బరి నూనె సహాయపడుతుందని తెలుసా ?

పొట్ట దగ్గర కొవ్వు కరిగించడానికి కొబ్బరి నూనె సహాయపడుతుందని తెలుసా ?

0

ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్యల్లో ప్రధానమైనది పొట్ట దగ్గర కొవ్వు పెరగడం. దీనినే మనం బెల్లి ఫ్యాట్ అని కూడా అంటారు. అయితే ఈ బెల్లి ఫ్యాట్ తగ్గడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదని దిగులుపడుతుంటారు. అయితే కొబ్బరి నూనెతో పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు అంతా మాయం అవుతుందట.

కొబ్బరి నూనెకేరళలో వంటల్లో కొబ్బరినూనె ఉపయోగిస్తున్నారు అలాగే అక్కడి అందరూ సన్నగానే ఉంటారు అలాగే వల్ల జుట్టు పొడవుగా ఉంటుంది దానికి ప్రధానమైన కారణం వాళ్లు కొబ్బరినూనె వాడటమే. కొబ్బరినూనె అనేది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. అలాగే కొబ్బరి నూనెతో చేసిన ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది అంటే మీరు ఏ పని చేయకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

కొబ్బరి నూనె తాగడం ద్వారా కడుపు నిండినట్టుగా ఉండి ఎక్కువగా ఆకలి వెయ్యదు అలా ఒకవైపు ఎక్కువ కేలరీలను ఖర్చు పెట్టి తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారు. కొబ్బరి నూనెలో ట్రైగ్లిజరైడ్స్ (ఎంసిటి) అధికంగా ఉంటాయి, దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోయాబీన్ నూనెకు బదులుగా కొబ్బరి నూనెను వంటలో ఉపయోగించడం వల్ల నడుము దగ్గర కొవ్వు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కడుపు కొవ్వును విసెరల్ ఫ్యాట్ అని కూడా అంటారు. ఇది మీ గుండె జబ్బులు మరియు మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. కొబ్బరి నూనె ఈ కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులోని శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెకు హాని కలిగిస్తాయనుకుంటారు. కానీ అది నిజం కాదు. శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ గుండెకు మేలు చేస్తాయి. దీన్లోని లారిక్‌ యాసిడ్‌ కొలెసా్ట్రల్‌.. రక్తపోటు వల్ల గుండెకు హాని కలగకుండా రక్షణనిస్తుంది.

కొబ్బరినూనెలోని షార్ట్‌ అండ్‌ మీడియం చైన్‌ ఫ్యాటీ ఆమ్లాలు శరీర అధిక బరువును తగ్గిస్తాయి. అలాగే కొబ్బరినూనె వాడటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. కొబ్బరినూనె వాడకం వల్ల థైరాయిడ్‌ ఇతర ఎండోక్రైన్‌ గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. శరీర మెటబాలిక్‌ రేట్‌ను పెంచుతుంది. ఫలితంగా బాడీ వెయిట్‌ అదుపులో ఉంటుంది.

అయితే దీనిని ఎలా ఉపయోగించాలి అంటే టిఫిన్, మధ్యాహ్నం భోజనం లేదా రాత్రి భోజనం చేసే అరగంట ముందు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను ఓ గ్లాసు నీళ్ళల్లో కలిపి గోరు వెచ్చగా చేసుకుని త్రాగాలి. అలాగే మీరు చేసుకున్న ప్రతి వంటను కొబ్బరినూనెతో చేసుకోండి. ప్రతి మూడు నాలుగు రోజులకి మీ బరువు ని చెక్ చేసుకోండి.

అంతేకాదు ఇలా చేయడం వలన మీ శరీరంలో చాలా ఆరోగ్యకరమైన మార్పు చూస్తారు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చర్మ సౌందర్యం పెంచుతుంది. చాలామంది జుట్టుకు రాసుకునే పారాషూట్ లాంటి కొబ్బరినూనె వాడుతున్నారు అలా అస్సలు చేయకండి. చాలా మట్టికి మన ఇంట్లోనే సహజంగా తయారుచేసిన కొబ్బరినూనె వాడండి.

Exit mobile version