Home Entertainment Few Rare & Unseen Images You Must See Of Soundarya Garu On...

Few Rare & Unseen Images You Must See Of Soundarya Garu On Her Death Anniversary

0

ఏప్రిల్ 17, 2004…. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు.. సినీ ఇండస్ట్రీ, అందులోనూ ప్రత్యేకంగా తెలుగు సినిమా ప్రేక్షకులు.. తట్టుకోలేని ఒక వార్త విన్నారు.. అది విని ఎంతో మంది కుంగిపోయారు.. కొంత మంది అయితే ఏడ్చారు.. కొందరైతే నిజమా..? అని ఏమీ అర్థం కాని స్థితిలో ఉండిపోయారు. అన్ని టీవీ ఛానెళ్లు, రేడియో అదే వార్త ప్రసారం చేస్తున్నాయి. ”బెంగళూరు శివారులో విమాన ప్రమాదం.. ప్రముఖ నటి సౌందర్య మృతి” అని. అంతే.. అన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా స్టార్స్ అందరూ బెంగళూరు వెళ్లడానికి రెడీ అయ్యారు. ఎంతో మంది ఆవిడ అభిమానులు ఏమీ చేయలేక.. బాధపడుతూ టీవీలో వచ్చే న్యూస్ చూస్తున్నారు. ఆ వార్త నిజమే అని అర్థం చేసుకుని.. నచ్చజెప్పుకోవడానికి చాలానే టైమ్ పట్టింది వాళ్లకు. అవును.. మనింట్లో అమ్మాయిలా మనకు బాగా దగ్గరైపోయిన మనందరి ఫేవరెట్ ‘సౌందర్య’ గారు మనల్ని విడిచివెళ్లి అప్పుడే 16 ఏళ్లు గడిచిపోయాయి. తను మనతో లేకపోయినా.. తన సినిమాలు చూసి మనతోనే ఉన్నట్లు అనుకుని ఈ రోజుకీ సంతృప్తి పడుతున్నాం.

మహానటి ‘సావిత్రి’ గారి తర్వాత ఆ స్థాయిలో నటించే గొప్ప నటి అనే పేరు ఒక్క సౌందర్య గారికే దక్కింది. ఆవిడ తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థాయికి వెళ్లలేదనే మాట మనం ఒప్పుకోవాల్సిందే. పుట్టింది కర్ణాటకలో అయినా.. తెలుగింటి అమ్మాయిలా మనకి బాగా దగ్గర అయిపోయింది. ఎన్నో మంచి పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా సత్తా చాటింది. ఎన్నో అవార్డులు అందుకుంది. ఒక్కసారి మన చిన్నతనం నుండి చూసిన సినిమాలను గుర్తు చేసుకుంటే.. సౌందర్య గారు చేసిన ఎన్నో సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు మన కళ్ల ముందు కదలాడుతాయి. చిన్నప్పుడు మనం అంత్యాక్షరి ఆడుతుంటే.. అందులో ఎక్కువగా ఆవిడ నటించిన పాటలే పాడేవాళ్లం.. గుర్తుందా..?

నటి అన్నాక.. అన్ని రకాల పాత్రలు చేయాలి.. అలాగే కొన్ని సార్లు ఇష్టం లేకపోయినా ”కొన్ని పాత్రలు” చేయటానికి ఒప్పుకోవాలి.. కానీ ఏ రోజు కూడా ‘సౌందర్య’ గారు తన హద్దులు దాటలేదు. అవకాశాల కోసం ఎప్పుడూ తన స్థాయిని దిగజార్చుకోలేదు. తనకు పోటీగా ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు.. వెళ్లారు. ఎంతో మంది అవసరాన్ని బట్టి అందాల ప్రదర్శన కూడా చేశారు.. కానీ సౌందర్య గారు ఎప్పుడూ అలా చేయాలని అనుకోలేదు. నిండైన చీరకట్టులో కూడా ‘అందం’గా కనిపించొచ్చని నిరూపించారు. అలా మాత్రమే కనిపిస్తూ 10 ఏళ్లు టాప్ హీరోయిన్ గా కొనసాగడమంటే మామూలు విషయం కాదు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళంలో పెద్ద హీరోల పక్కన పోటాపోటీగా నటించారు. తెలుగులో మన వెంకీ మామకి బెస్ట్ పెయిర్ సౌందర్య గారే. ‘అమ్మోరు’ లో సౌందర్య చేసిన భక్తురాలి పాత్ర తన నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే అలాంటి పాత్రని అంత అద్భుతంగా చేయడం ఓ పెద్ద ఛాలెంజ్. ఆ తర్వాత చేసిన ‘పవిత్ర బంధం’, ‘పెదరాయుడు’, ‘అంతఃపురం’, ‘రాజా’ సినిమాల్లో సౌందర్య గారిని తప్ప వేరే వాళ్లను అస్సలు ఊహించుకోలేం. ఇక బాలీవుడ్ లో ఏకంగా అమితాబ్ బచ్చన్ గారి పక్కన ‘సూర్యవంశం’ సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

పేరుకు తగ్గట్లుగానే సౌందర్య గారు చాలా అందంగా ఉంటారు. అలాంటి అందం, అంత అద్భుతంగా నటించి మన ఇంటి ఆడపిల్లలా మన మనసుల్లో స్థానం సంపాదించడం ఇక మరెవరికి రాదేమో కదా…! ఇకపై కూడా తన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరేమో.! అంతటి గొప్ప నటి ఇక మనకు దొరకదేమో.! తన సినిమాలను, తనతో మనకు ఉన్న జ్ఞాపకాలను మాత్రమే వదిలేసి తిరిగిరాని లోకాలకు ఆ ‘సౌందర్యం’ వెళ్లిపోయింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

చివరగా ఒక్క మాట.. ”ప్లీజ్ ‘సౌందర్య’… తిరిగిరావా..”

1. చిన్నప్పుడు సౌందర్య

S 1

2. అమ్మతో..

3. నాన్నతో…

4. బాలీవుడ్ షెహన్ షాతో..

5. మెగాస్టార్ చిరుతో ‘అన్నయ్య’ షూట్ టైంలో…

6. వెంకీ మామతో ఫిలిం ఫేర్ అందుకుని..

7. నందమూరి రామారావు గారు, రమ్యకృష్ణతో..

8. ‘మాయలోడు’ సినిమా షూటింగ్ లో…

9. ‘ఎదురులేని మనిషి’ షూటింగ్ ప్రారంభం…

10. ‘అంతఃపురం’ టైములో చిలిపి సౌందర్య…

Exit mobile version