Home Health విశ్రాంతి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోండి! 

విశ్రాంతి ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసుకోండి! 

0
ఈ  రోజుల్లో మనిషి మానసికంగా లేదా, శారీరకంగా అయినా ఏదో ఓ పని చేయక తప్పడం లేదు. శర్మ ఎక్కువైనప్పుడు ఒత్తిడికి లోనవడం కూడా సర్వ సాధారణమైపోయింది. ఉదయం నిద్రలేచినపుడు తాజాగా ఉంటే అది మంచి ప్రారంభం. కానీ పగలు గడుస్తున్న కొద్దీ, మీ విశ్రాంతి స్థాయి తగ్గుతున్న కొద్దీ, మీరు క్రమంగా ఒత్తిడిని అనుభూతి  చెందుతుంటారు.
ఈ ఒత్తిడికి కారణం ఏదైనా కావొచ్చు. ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా చూస్తుంటాం.  కొన్ని ఉద్యోగాలు సవాలు చేసే సందర్భాలని సృష్టిస్తాయి.  అక్కడ చిరాకు పెట్టే అధికారి ఉండవచ్చు, అభద్రత కలిగించే సహోద్యోగులుండవచ్చు, అందుకోలేని కాల నియమాలుండవచ్చు. ఇంటి సమస్యలు కావొచ్చు, ఉద్యోగ సమస్యలు కావొచ్చు, పని ఒత్తిడి కావొచ్చు… ఆ పరిస్థితికి మనం ప్రతిస్పందించే నిర్బంధతే మనకి ఒత్తిడి కలిగిస్తుంది.
ఒత్తిడి అన్నది మన లోపల కలిగే ఒక మాదిరి రాపిడి. అయితే ఎదో ఒక స్థాయిలో, మన శరీరాన్నీ, మనసునీ, భావాలనీ నియంత్రించుకోవడం మనకి తెలియటం లేదు. అదే అసలు సమస్య. ఒక సాధారణ వ్యక్తి ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తన నాడి నిముషానికి 70 నుండి 80 మధ్య కొట్టుకుంటుంది. సరియైన క్రమంలో ధ్యాన సాధన చేసే వ్యక్తికి నాడి 30 నుండి 40 మధ్య కొట్టుకుంటుంది.
మధ్యాహ్నం బాగా సుష్టుగా భోజనం చేసిన తర్వాత కూడా అది 50 లలోనే అదుపులో ఉంటుంది. ఇది శరీరం ఏ మేరకి క్షణక్షణమూ ఒత్తిడి అనుభవిస్తోందో తెలుసుకోవడానికి ఒక ప్రమాణము. అయితే.. పని ఒత్తిడి నుంచి బయటపడాలంటే విశ్రాంతి తప్పనిసరి అని అంటున్నారు నిపుణులు.
విశ్రాంతి అనగానే నిద్రపోవడమే అనుకుంటారు.  ఎందుకంటే నిద్రపోయి లేవడం అంటే మనం శారీరంగానూ, మానసికంగానూ విశ్రాంతి పొందినట్టు గా ఉంటుంది. లేదంటే టీవీ లోనో, ఫోన్ లోనో ఏదో నచ్చిన ప్రోగ్రాంచుస్తూ ఉండడం వలన  ఉపశమనం లభించింది అనుకుంటాం. కానీ ఇక్కడ నిజమేంటంటే సోషల్ మీడియా, టీవీ వల్ల మనం మన మైండ్ కు మరింత పని పెట్టినట్టు అవుతుందట.
అసలు  విశ్రాంతి అంటే ఏంటి.. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది  కొందరు నిపుణులు చెబుతున్నారు. వాటిగురించి తెలుసుకుందాం. శరీరానికి కావలసింది నిద్రకాదు, విశ్రాంతి.  శరీరాన్ని పగలల్లా విశ్రాంతిగా ఉంచగలిగితే, సహజంగా నిద్రపోయే సమయం తగ్గు ముఖం పడుతుంది. పనీ, నడక, వ్యాయామం కూడా విశ్రాంతి కలిగించగలిగితే, నిద్ర సమయం ఎంతో గణనీయంగా ఇప్పుడు
ఇప్పుడు ప్రతివారూ ఎలాగైనా ప్రతిపనీ కష్టపడి చేయాలనుకుంటున్నారు. పార్కుల్లో నడిచేవాళ్ళు ఎంతో ఒత్తిడితో ఉండడం గమనించవచ్చు. విశ్రాంతి దొరకని వ్యాయామం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందట. శారీరక విశ్రాంతి కావాలి అంటే కొంచెం సేపు పడుకోవడంతో పాటు విశ్రాంతిగా ఉంటూ బాగా ఇష్టమైన పని చేస్తూ ఉండాలి. విశ్రాంతిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి.
ఇంద్రియ విశ్రాంతి లో ఇంద్రియాలపై పడే ఒత్తిడిని దూరం చేసుకోవడమే సెస్సరీ రెస్ట్ అంటారు. ఇందుకోసం మనం మన ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నింటికి దూరం గా ప్రశాంతంగా ఉండటం.  ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లడం లాంటివి చేస్తే బావుంటుందట. దీని వలన మన ఇంద్రియాలు అదుపులో ఉంటాయి.
భావోద్వేగ విశ్రాంతి అనగా… మన మనసులో ఉన్న భావోద్వేగాల ను కొద్దిసేపు మరిచిపోవాలి. అది కాదంటే వాటిని మనకు బాగా ఆప్తులైనవారితో పంచుకోవడం అని వైద్యులు చెబుతున్నారు.
సామాజిక విశ్రాంతి  అంటే సోషల్ రెస్ట్. ఇది మనల్సి మనం పరిశీలించుకోవడం. మన గురించి మనం తెలుసుకోవడం.దీని కోసం మన దగ్గరి వ్యక్తినో, గురువుగారి దగ్గరకు వెళ్లి మాట్లాడటం చేయాలట.
ఆధ్యాత్మిక విశ్రాంతి అంటేఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్లొనడం వల్ల మన మెదడకు కాస్త విశ్రాంతి కలుగుతుండి. అయితే.. ఇది అందరికీ ఇష్టమైన విషయం కాదు, దీనికి బదులుగా యోగా వంటివి చేసుకోవడంలేదా ఇతరులకు నేర్పించడం వంటివి చేస్తే మానసిక, శారీరక విశ్రాంతిని పొందవచ్చట.

Exit mobile version