చర్మం అందంగా ఉండాలని ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న బ్యూటీ ప్రొడక్ట్స్ తెచ్చుకుని వాడుతారు కొంతమంది. కానీ అలా కాకుండా.. పెరగాల్సిన అందం తరుగుతూ ఉంటే.. ఏదో పొరపాటు చేశారన్నమాట. అంటే చర్మానికి తగ్గ సౌందర్య ఉత్పత్తిని ఎంచుకోలేదనే అర్థం. పైగా ఒక్కో బ్యూటీ ప్రొడక్ట్ ఒక్కో రకమైన స్కిన్ టైప్ కి మాత్రమే పని చేస్తుంది. కాబట్టి సౌందర్య ఉత్పత్తులు ఎంచుకునే ముందు మీ చర్మ తత్వం ఎలాంటిదో తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అదెలాగో చూద్దాం.
ఓ చిన్న టెస్ట్ చేసుకోవడం ద్వారా స్కిన్ టైప్ ఎలాంటిదో గుర్తించవచ్చు.
ముఖం శుభ్రం చేసుకున్న గంట తర్వాత చర్మం బిగుతుగా, దురదగా, అక్కడక్కడా పొడిగా ఉన్నట్లయితే పొడి చర్మం(డ్రై స్కిన్).
టీ జోన్ లో జిడ్డుగా, మెరుస్తున్నట్టుగా ఉంటే.. జిడ్డు చర్మం(ఆయిలీ స్కిన్).
పొడిగా లేదా జిడ్డుగా లేకుండా సాధారణంగా ఉంటే..నార్మల్ స్కిన్.
ఈ చిట్కాను పాటించి.. మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకుని మీ చర్మానికి తగ్గ ఉత్పత్తులు ఎంచుకోండి.