Home Health ఎలాంటి కాయగూరలు కొంటే మంచిదో తెలియాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

ఎలాంటి కాయగూరలు కొంటే మంచిదో తెలియాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే

0

ఎప్పుడైనా మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తే వంకాయలు పుచ్చులున్నాయి, బెండకాయలు ముదిరిపోయాయి, ఆకు కూరలు తాజాగా లేవు అంటూ అమ్మతో చివాట్లు తినడం మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. ఇంకా జరుగుతూనే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి?

Vegetablesమార్కెట్ కి వెళ్ళి వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకుంటాం. కానీ అవి మూడు నాలుగు రోజుల్లోనే పాడైపోతూ ఉంటాయి. మనలో చాలా మందికి ఏవి తాజా కూరగాయలు, ఏ కూరగాయలను ఎలా చూసి తీసుకోవాలి అనే విషయంలో సందేహాలు ఉంటాయి. మరి కూరగాయలు ఎలా కొనాలి.. ఎలాంటి కాయగూరలు కొంటే మంచిదో తెలియాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.

బెండకాయలు ఆకుపచ్చరంగులో ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. పసుపు రంగులోకి మారినట్టు కనిపించినా,గట్టిగా ఉన్నా వాటిని తీసుకోకపోవడం మంచిది. ఇంకా అనుమానంగా ఉంటే బెండకాయ చివరని చిన్నగా విరిచి చూడండి. సులువుగా విరిగితే లేతగా ఉన్నట్టు. లేకపోతే ముదిరిపోయినట్టు గుర్తించాలి.

బంగాళా దుంపలు గట్టిగా వుండాలి. పై పొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో వుండాలి. బంగాళా దుంప పైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు వున్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు, దుంపల పైన గుంటలు లేకుండా నున్నగా వుండేవి చూసి కొనండి.

వంకాయలు ముడతలు పడకుండా వుండాలి. మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. తొడిమ ఆకుపచ్చరంగులో, తోలు నిగనిగ లాడుతూ వుండాలి. పుచ్చులు లేకుండా చూడాలి.

అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకూడదు. ముదురు రంగులో వున్న అల్లం చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి అల్లాన్ని అంచనా వేయాలి.

ఉల్లిపాయలు గట్టిగా వున్నవి మాత్రమే కొనాలి. ఉల్లిపాయ పై పొరలో తేమ వుంటే అసలు కొనవద్దు.

కాలీఫ్లవర్ కొనే ముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో వుండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న ఫ్లవర్ ను కొనవద్దు. పువ్వు విడిపోకుండా దగ్గరగా వున్న వాటినే కొనాలి.

బీట్రూట్ కొనే ముందు దాని కింద భాగంలో వేర్లు వున్న వాటిని కొనండి. ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.

మంచి ఆకారం కలిగివున్న క్యారెట్టునే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా వున్న క్యారెటను కొనవద్దు. క్యారెట్ మొత్తం మెత్తగా వున్నా, అక్కడక్కడా మెత్తగా వున్నా కొనవద్దు. క్యారెట్ లేతగా వుంటే మరీ మంచిది. క్యారెట్ నిల్వ వున్నట్లయితే వూరకే మెత్తపడిపోతుంది.

ఆకుకూరలు కొనే ముందు వాటి పైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా వుండేటట్లు చూసుకోవాలి.

 

Exit mobile version