ప్రస్తుతం చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలడం. తీవ్ర ఒత్తిడి, మారిన జీవన విధానం వల్ల చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలిపోతోంది. జుట్టు రాలడాన్ని అరికట్టడం కోసం, తల మీద వెంట్రుకలు వేగంగా పెరగడం కోసం ఉల్లిపాయ రసం అద్భుతంగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలకు ప్రధాన కారణం జుట్టులో ఉండే చుండ్రు మరియు కేరాటిన్ అనే ప్రొటీన్ లోపం వల్ల జరుగుతుంది.
జుట్టు తిరిగి పెరగడానికి సల్ఫర్ కేరాటిన్ అవసరం. ఇది ఉల్లి రసంలో పుష్కలంగా లభిస్తుంది మరియు ఇది కేరాటిన్ అనే ప్రొటీన్ ని పెంచి చుండ్రుని తగ్గిస్తుంది కాబట్టి ఉల్లిపాయ రసం ఊడిపోయిన జుట్టు తిరిగి పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసం తల మీద ఉండే చెడు చుండ్రును చర్మాన్ని శుభ్రం చేయటానికి సహాయపడుతుంది.
చిన్న ఉల్లిపాయలను మిక్సీలో వేసి కాస్త నీటిని చేర్చి రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఓ బౌల్‌లో వడగట్టుకుని.. ఆ రసాన్ని తల మాడుకు పట్టిస్తూ బాగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం వుంటుంది.
జుట్టు రాలడం తగ్గడంతోపాటు చుండ్రు కూడా తగ్గుతుంది. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ పెరిగి, కురులకు శక్తి లభిస్తుంది. ఆడవాళ్లు ఉల్లిపాయ జ్యూస్‌ను జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీని వల్ల వారి జుట్టు నిగనిగగలాడుతుంది.
ఉల్లిపాయ రసంతో కొబ్బరి నూనె కానీ ఆలివ్ నూనె కానీ జోడించడం వలన ఉల్లిపాయ రసం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. జుట్టు పెంచడానికి సహాయం చేస్తుంది. ఉల్లిపాయ రసంతో గుడ్డు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుడ్లు అధిక ప్రోటీన్ మరియు ఒమేగా 3 మీ జుట్టు పెరుగుదల ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. కాకపోతే గుడ్డు ఉపయోగించడం వల్ల ఎక్కువ వాసన వస్తుంది కాబట్టి ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమంలో కలిపితే వాసన రాకుండా ఉంటుంది.