Home Health విటమిన్ బీ12 లభించే ఆహారాలు!

విటమిన్ బీ12 లభించే ఆహారాలు!

0
మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. అందులో ఒకటి విటమిన్ బీ12. చాలా మంది కొంచెం నీరసంగా అనిపిస్తే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. నిజానికి బీ విటమిన్స్ ఎనిమిది రకాలు – బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ7, బీ9, బీ12. వీటన్నింటినీ కలిపి బీ కాంప్లెక్స్ అంటారు. ఈ రోజు మనం విటమిన్ బీ12. గురించి ప్రాముఖ్యత గురించి, అది ఎక్కువగా లభించే ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
  • బీ12 లో కోబాల్ట్ కూడా ఉంటుంది. అందుకే, ఈ విటమిన్ ని కోబాల్మిన్ అని అంటారు.  ఇది లోపిస్తే చాలా సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మహిళల్లో అయితే ఎక్కువ సమయం కిచెన్ లో ఉండే కారణంగా తలనొప్పి, తీవ్రమైన అలసట  వస్తుంటుంది. విటమిన్ బి 12 లోపంపై అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఊపిరి తిత్తుల సమస్యలైన శ్వాస సరిగ్గా ఆడకపోవడం, మానసిక సమస్యలు, మలబద్ధకం వంటివి వస్తాయి. మన నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి బీ12 విటమిన్ తప్పనిసరి. దీని లోపం కొద్ది మోతాదులోనే ఉంటే కండరాల బలహీనత, నిస్సత్తువ, వణుకు, నోటి పుండు, మూత్రం ఆపుకోలేకపోవటం, రక్తపోటు తక్కువ కావటం, కుంగుబాటు, మతిమరుపు వంటి గ్రహణ సమస్యలు తలెత్తుతాయి.
  • ఇక లోపం మరీ తీవ్రమైతే మాత్రం రక్తహీనతకు దారితీస్తుంది. అన్ని బీ విటమన్ల మాదిరిగానే బీ12 కూడా నీటిలో కరుగుతుంది. అయితే మోతాదు ఎక్కువగా ఉంటే దీన్ని మన శరీరం.. కాలేయం, కణజాలాల్లో నిల్వ చేసుకుంటుంది. అందువల్ల ఆహారం ద్వారా తగినంత బీ12 తీసుకోకపోయినా చాలాకాలం పాటు రక్తంలో దీని మోతాదు తగ్గినట్టు కనిపించదు. ఒకవేళ నిల్వ మోతాదు తక్కువగా ఉంటే చాలా త్వరగానే బీ12 లోపం కనబడొచ్చు. పిల్లల్లోనైతే అంతకన్నా ముందుగానే ప్రభావం చూపుతుంది.
  • మరి ఇంత ముఖ్యమైన విటమిన్ బి 12 మనిషికి ఎక్కడ్నించి వస్తుందో తెలుసా. విటమిన్ బి 12 అనేది ప్రదానంగా జంతు సంబంధ ఉత్పత్తులు అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ లో లభ్యమవుతుంది. శాకాహారంలో ఈ విటమిన్ ఉండదు. అందుకే శాకాహారుల్లో ఈ విటమిన్ లోపముండేవారు ఎక్కువగా కన్పిస్తుంటారు. ఇలాంటివారు వైద్యుల సూచన మేరకు విటమిన్ బి 12 ట్యాబ్లెట్లు తీసుకోవల్సి ఉంటుంది.

విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహార పదార్ధాలు:

  • సముద్రపు చేపలైన సాల్మన్ వంటివి తరచూ తీసుకుంటే దేహానికి అవసరమైన చాలా రకాల పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ముఖ్యంగా విటమిన్ బి 12 అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, రిబోఫ్లేవిన్, నియాసిస్, థియామిన్, విటమిన బి 6 వంటివి అందుతాయి.
  • సీఫుడ్స్ లో ఒకటి క్య్రాబ్స్. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే బ్లూ అండ్ రెడ్ కింగ్ క్రాబ్ ను తీసుకోవడం మంచిది. క్రేఫిష్, రొయ్యలు, మరియు లాబ్ స్టర్ వంటివి తీసుకోవడం మరో ఆప్షన్ . మంచి క్వాలిటీ ఉన్న క్య్రాబ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది.
  • మాంసంలో కూడా విటమిన్ బి 12 సమృద్ధిగా ఉంటుంది. అయితే మాంసాన్ని ఎంచుకునేటప్పుడు తక్కువ కొవ్వుశాతం ఉండేది ఎంచుకోవడం మంచిది. బీఫ్ మరియు చికెన్ లివర్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. చికెన్ లో ఎక్కువగా ఉంటుంది. అయితే మాంసాన్ని బాగా ఉడికించి కూరగా చేసుకుని తింటే మంచిది. దీంతో పాటు విటమిన్ బి కాంప్లెక్స్ కావల్సినంత లభిస్తుంది.
  • సోయా ప్రొడక్ట్స్ లో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. మీరు సోయా మిల్క్ ను కూడా ప్రయత్నించవచ్చు . విటమిన్ బి12కు ఇది మరో ప్రత్యామ్నాయం. గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా పచ్చసొనలో, కొద్దిగా ఎగ్ వైట్ లో ఉంటుంది. ఒక ఉడికించిన గుడ్డులో 0.7mcg విటమిన్ బి12 ఉంటుంది.

Exit mobile version