Home Unknown facts Ganga Samudhramlo Kalise Pavithra Sthalam

Ganga Samudhramlo Kalise Pavithra Sthalam

0

గంగా నదిని హిందువులు అతి పవిత్రంగా భావిస్తారు. సంస్కృతంలో నీరుని గంగ అని పిలుస్తారు. గంగా నదిని గంగమ్మ తల్లి, పవన గంగ, గంగ భవాని అని పిలుస్తారు. ఇంతటి పవిత్రమైన గంగానది సముద్రంలో కలిసే ఆ క్షేత్రం ఎక్కడ ఉంది? అక్కడ గల ఆశ్చర్యకర విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. gangaపశ్చిమబెంగాల్ రాష్ట్రం, కలకత్తా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో డైమండ్ హార్బర్ ఉంది. ఈ హార్బరులో స్టీమర్లు ఉన్న సమీపంలో గంగా సాగర్ అనే ప్రదేశం చూడదగినది. ఈ ప్రదేశంలోనే గంగ సముద్రంలో కలుస్తుంది. ఈ గంగా సాగర సంగమస్థానం హిందువులకి ఎంతో పవిత్రమైన స్తలం. అయితే ఇక్కడ స్టీమర్ పైన కొంత దూరం వెళ్లిన తరువాత అక్కడ గంగాదేవి ఆలయం, కపిల మహర్షి ఆలయం, భగీరథుడు, గంగ సాగర సంగమస్థానం, కపిల మహర్షి ఆశ్రమము ఉన్నాయి. సముద్రంలో కలసిపోయిన కపిలముని ఆశ్రమమున మకర సంక్రాంతికి చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యముగా మూడు రోజుల పాటు పండుగ నిర్వహిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే. మకర సంక్రాంతి సమయమున సముద్రము కొంత వెనుకకు తగ్గి కపిల ముని ఆశ్రమ ప్రాంతం కనిపిస్తుంది. ఇక గంగ భూమి మీదకు రావడం వెనుక పురాణం ఏంటంటే, సగర చక్రవర్తి అశ్వమేధ యాగము చేయుటకు సంకల్పించగా ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టివేస్తాడు. ఆ రాజు కుమారులు అయినా 64000 మంది వచ్చి కపిల మహర్షిని నిందించగా, ఆ మహర్షి శపించి వారిని భస్మం చేస్తాడు. ఇక వారి మునిమనువాడు అయినా భగీరథుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి జటాజూటము నుండి గంగను భువికి తీసుకువస్తాడు. గంగానది గంగోత్రిలో దిగి, గంగాసాగర్ లోని భస్మరాశులపై ప్రవహించి సాగర సంగమము చేసినది. దీనినే సాగర్ మేళా అని కూడా అంటారు. గంగా నదిని సాగర సంగమంగా పిలుస్తారు. దీనిని అధినాథ క్షేత్రం అని కూడా అంటారు.

Exit mobile version