Home Unknown facts స్వయానా ఆ గంగమ్మ తల్లే శివుడిని అభిషేకించిన అద్భుత ఆలయం

స్వయానా ఆ గంగమ్మ తల్లే శివుడిని అభిషేకించిన అద్భుత ఆలయం

0

శివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఆధ్బుతం ఏంటంటే స్వయానా ఆ గంగమ్మ తల్లే శివుడిని అభిషేకిస్తుంది. ఇలాంటి విశేషం దేశంలో మనకి మరెక్కడా కనిపించదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ శివలింగానికి అభిషేకం ఎలా జరుగుతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ganga Do Abhishekam To Shiva Linga

తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా, కొప్పోలు ప్రాంతంలో ఉమా సంమేశ్వరుని ఆలయం ఉంది. ఈ మహిమాన్విత క్షేత్రంలో శివుడు ఉమా సంగమేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. అయితే శ్రావణమాసంలో ఏదో ఒక రోజున ఈ గర్భాలయంలోకి భూగర్భం నుంచి నీరు ఉబికి వచ్చి శివలింగాన్ని స్పర్శించడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. కొన్ని శైవ క్షేత్రాలలో స్వామివారి గర్భాలయంలోకి నీళ్లు రావడం, కొన్నిరోజుల తరువాత ఆ నీళ్లు తగ్గుముఖం పడుతూ అదృశ్యం కావడం జరుగుతూ వుంటుంది. మరికొన్ని క్షేత్రాల్లో స్వామివారిని అభిషేకించిన నీళ్లు గర్భాలయం నుంచి బయటికిరాకుండా అక్కడే అదృశ్యమవుతూ వుంటాయి.

ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి పోతున్నాయో అంతుచిక్కకపోవడం విచిత్రంగా మహిమగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు. ఇక ఈ క్షేత్రంలో స్వామివారి గర్భాలయంలోకి వచ్చిన నీళ్లు కొంతసేపటి తరువాత అదృశ్యమవుతాయని చెబుతారు. ఈ నీళ్లు కూడా ఎలా వస్తున్నాయో ఆ తరువాత ఏమైపోతున్నాయో ఎవరికీ తెలియదు. గంగమ్మ తల్లే స్వామివారిని అభిషేకించడం కోసం ఆ స్వామి స్పర్శతో తరించడం కోసం ఇలా వస్తూ ఉంటుందని విశ్వసిస్తుంటారు.

అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసే భాగ్యం దక్కిన భక్తులు తమ జన్మధన్యమైందని భావిస్తుంటారు. ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనీ, అందుకే ఈ మహిమ జరుగుతూ వస్తోందని అంటారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

 

Exit mobile version