Home Health జుట్టుకు నెయ్యి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా ?

జుట్టుకు నెయ్యి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా ?

0

కాలుష్యానికి రాలిపోతున్న జుట్టును చూసి మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం. ఏవేవో మందులూ, షాంపూలూ, డాక్టర్ల సలహాలూ ఇలా ఎన్నొ రకాలుగా రాలిపోయే జుట్టుని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ మన వంటింట్లోనే దానికి సరైన రెమెడీ ఉందని తెలుసుకోము. మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే నెయ్యి వల్ల మన శిరోజాలకు చాలా లాభం చేకూరుతుంది. నెయ్యిని ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

Ghee that removes hair problems నెయ్యి పేరు చెప్పగానే చాలామందికి నోరూరిపోతుంది. ఎందుకంటే నెయ్యితో చేసిన స్వీట్స్, ఫుడ్ అంత రుచికరంగా ఉంటాయి. ఆహారపదార్థాలకు రుచిని అందించడానికి మాత్రమే కాదు.. నెయ్యి మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. నెయ్యి వేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మన శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడంలోనూ నెయ్యి తన వంతు పాత్ర పోషిస్తుంది.

ఇక జుట్టు నల్లబడడంలోనూ నెయ్యి పాత్ర చెప్పదగినదే.. నెయ్యిని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారడమే కాదు.. మెరుస్తూ కనిపిస్తుంది కూడా.. దీనికోసం మనం చేయాల్సిందల్లా.. ఆవు నెయ్యితో మన తలను చక్కగా మసాజ్ చేసుకొని ఓ గంట ఆగి తలస్నానం చేయడమే.. ఇలా కనీసం వారానికి రెండుసార్లయినా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

నాణ్యమైన దేశీయ నెయ్యి జుట్టుకు మంచి కండిషనర్‌గా పని చేస్తుంది. రెండు చెంచాల నెయ్యిని ఒక చెంచా ఆలివ్ నూనెతో కలిపి తల వెంట్రుకలకు రాసిన తర్వాత 20 నిమిషాల వరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే వెంట్రుకల చివరలు రెండుగా చిట్లిపోతున్నాయని చాలామంది జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. కానీ ఆ సమస్య నుంచి విముక్తి పొందాలని మీ వెంట్రుకలని కత్తిరించుకోనవసరం లేదు నెయ్యితోనే దీనికి చెక్ పెట్టవచ్చు.

మూడు చెంచాల నెయ్యి తీసుకొని వెంట్రుకల చివర్లో రాసి 15 నిమిషాల తర్వాత తల దువ్వుకొని, మైల్డ్‌షాంపూతో కడిగేస్తే సరిపోతుంది. పొడి జుట్టు.. పొడి చర్మం ఉండి చుండ్రు సమస్యతో బాధ పడేవారు నెయ్యి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు సౌందర్య నిపుణులు. గోరువెచ్చని నెయ్యి, బాదం నూనె కలిపి వెంట్రుకల మొదళ్లలో రాసి 15నిమిషాల పాటు ఉంచి నెయ్యి పోయేలా రోజ్ వాటర్‌తో వెంట్రుకలని కడిగేయాలి. నెలకు రెండుసార్లు పైవిధంగా చేస్తే మంచి ఫలితం అని అంటున్నారు నిపుణులు.

పొడి చర్మం.. ఆయిలీ స్కిన్ ఇలా రెండు రకాల చర్మ గుణాలు కల్గిన వారు ఒకట్రెండు సార్లు వాడినా.. ఫలితం లేదనుకునేవాళ్లు దీనిని వాడకపోవడం మంచిది. నెయ్యి వాడితే జుట్టుకి ఉసిరి, ఉల్లిపాయ‌లు వంటివి కూడా అక్క‌ర్లేదు. క‌నీసం నెల‌కు రెండుసార్లు రాత్రులు త‌ల‌కు నెయ్యిని అప్ల‌యి చేసుకుని తెల్లారి త‌ల‌స్నానం చేయాలి. గోరువెచ్చ‌గా ఉన్న నేతిని, బాదంనూనెతో క‌లిపి త‌ల‌కు మసాజ్ చేయాలి. పావుగంట త‌రువాత రోజ్ వాట‌ర్‌తో నేతిని తొల‌గించుకోవాలి. నెల‌కు రెండుసార్లు చేస్తుంటే జుట్టులోని పొడిద‌నం త‌గ్గుతుంది. అలాగే చుండ్రు కూడా త‌గ్గిపోతుంది.

జుట్టుకు పోషకాలు అంది బలంగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పాలు, 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్, ఈ మూడు పదార్థాలను కలపాలి. దాన్ని పేస్ట్‌గా చేసి హెయిర్‌కి అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. తరుచూ ఇలా చేయడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. అయితే జు‌ట్టుకి సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌కు దేశీయ ఆవుల‌నుండి తీసిన నాణ్య‌మైన నెయ్యి చ‌క్క‌గా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఎలాంటి కెమిక‌ల్స్ లేని ఈ నెయ్యితో జుట్టుకి మేలే త‌ప్ప‌ ఏ హానీ ఉండ‌దు.

Exit mobile version