సీజన్ మారినప్పుడు మన ఆహార అలవాట్లలో కూడా మార్పులు వస్తుంటాయి. ఎండాకాలంలో అయితే శరీరానికి చలువ చేసే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అదే చలికాలం వచ్చిందంటే మసాలా వస్తువులు, నూనె పదార్దాలు, స్పైసి ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తాం. కమ్మని వంటలు ఎలా ఉన్నా ఘాటు ఫుడ్ తింటారు, మరీ ముఖ్యంగా ఈ సమయంలో కొందరు ఇష్టంగా జంక్ ఫుడ్ తింటారు. వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు.
జంక్ ఫుడ్ మాత్రమే కాదు మనం తరుచూ తినే ఆహార ఇలా చలికాలంలో ఏది పడితే అది తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో హాని కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అలాంటి వాటిలో పచ్చి బఠాణి కూడా ఒకటి. చాలామంది పచ్చి బఠాణీలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇది కూరగా కూడా చాలా మంది వండుకుని తింటారు. మిక్చర్లలో కూడా వేసుకుని తింటారు.
అయితే ఇలా తినే ముందు ఆలోచించాలి అంటున్నారు నిపుణులు. చలికాలంలో బఠాణీలు తినడం వల్ల ఎంతో ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బఠాణి చెట్లు లాక్టిన్ ను ఉత్పత్తి చేయగలవని చెబుతున్నారు. ఈ చెట్లు కీటకాల నుంచి రక్షణ కోసం లాక్టిన్ ఉపయోగిస్తాయి.
పచ్చి బఠానీల పై ఉండే లాక్టిన్ కూరగాయలు లేదా ధాన్యాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందట. అందుకే ఇవి ఈ సమయంలో ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు.
ఇవి అతిగా తింటేకడుపులో నొప్పి అలాగే అలర్జీ అనేది శరీరంపై కనిపిస్తుంది. అందుకే ఈ వింటర్ సీజన్లో వీటికి దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.