Home Entertainment 14 Hard Hitting Dialogues From The Movie ‘Solo’ Which Will Melt Your...

14 Hard Hitting Dialogues From The Movie ‘Solo’ Which Will Melt Your Heart

0

Nara Rohit career lo one of the best movie idi & ee movie theesina directorye Geeta Govindam kuda theesindi. Prathi cinema lo dialogues untai kani konni cinemalaloni dialogues matrame manaki eppatiki gurtundi pothayi ala eppatiki gurtundi poye dialogues chala unnayi solo movielo. So okasari Solo movie loni dialogues ni gurtuchesukundama???

1) డైలాగ్ 1

Solo

నేను పోయేటప్పుడు నా చుట్టూ నలుగురు లేకపోతే నా తప్పు అవుతుంది కానీ…పుట్టేటప్పుడు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది సర్

2) డైలాగ్ 2

ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయి కానీ పెళ్లైన తరువాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానంపై ఆధారపడి ఉంటుంది.

3) డైలాగ్ 3

ఇన్నాళ్లు నా మీద మీకున్నది కోపం అనుకున్నాను కానీ అది అసహ్యం అని ఇవాళే తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది కానీ అసహ్యం పెరుగుతుందే తప్ప తగ్గదు సర్

4) డైలాగ్ 4

బాధ అంటే ఏంటో తెలుసా రా మీకు? మనకి ఊహ తెలిసే సరికి మన చుట్టూ నా అనే వాళ్ళు ఎవరు లేకుంటే, ఎలా బతకలిరా అనే భయం ఉంటుంది చూడు దాన్ని బాధ అంటారు రా, మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతామో అని మొహం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు, అప్పుడు మన మీద మనకి అసహ్యం కలిగి తూ దీనమ్మ జన్మ అనిపిస్తుంది చూడు దాన్ని బాధ అంటారు రా, పండగలకి పబ్బాలకి మీరందరు మీ ఫామిలీస్ తో సరదాగా గడుపుతుంటే ఒక్కడినే రూమ్లో కూర్చొని బోరు మని ఏడుస్తాను చూడు రా దాని బాధ అంటారు రా…

5) డైలాగ్ 5

వైషూ మొన్న ఒక మాట అడిగింది సర్ “మర్చిపోగలవా?” అని, తనే నా జీవితం అయినప్పుడు ఎలా మర్చిపోగలను సర్

6) డైలాగ్ 6

Family అంటే number of persons కాదు , number of emotions

7) డైలాగ్ 7

గుండెల్లో పెట్టి చూసుకునే మంచి భర్త ఉంటె గుడిలో దేవుడిని కూడా మర్చిపోతారు నాన్న మా ఆడాళ్ళు

8) డైలాగ్ 8

– నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావ్ అంటే నీ ప్రేమలో నిజం లేదు?
– నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒక్కటే కాదు వైషూ, మనం ప్రేమించిన వాళ్ళకి మన వల్ల చెడు జరుగుతుంది అంటే వదిలివెయ్యటం కూడా ప్రేమే

9) డైలాగ్ 9

– వైష్ణవి అంటే మీ భార్య?
– నా కూతురు.
– కూతురు మీద ప్రేమ ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి గాని ఇలా బండ్ల మీద బీడీ కట్టలు మీద రాసుకొని తిరగకూడదు. ఏంటి…ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం కాస్త కేర్ఫుల్ గా హేండిల్ చెయ్యి

10) డైలాగ్ 10

ఆశపడడం నిరాశపడడం అంతలోనే సర్దుకుపోవడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది సర్

11) డైలాగ్ 11

ఆంధ్రప్రదేశ్లో గడపకో ఓ అమ్మాయి ఉంది నాన్న అన్నదమ్ములు కోప్పడతారు అని అమ్మానాన్నలు బాధపడతారు అని ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని నటిస్తూ బతికేస్తున్న వాళ్ళు నేను వారిలా బతికేస్తా నాన్న

12) డైలాగ్ 12

ఎన్ని కష్టాలు పడుతున్నామే అని అనుకుంటారు ఆడవాళ్లు? కానీ మీరు కష్టాలు పడుతున్న విషయం తెల్సి తట్టుకోవడం ఏ తమ్ముడికైనా అన్నకైనా తండ్రికైనా నరకం అని మీకు తెలీదు

13) డైలాగ్ 13

అది ఎప్పుడైనా సంతోషంగా లేదు అని తెలిస్తే దానికి పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న సరే వచ్చి తీసుకొచ్చేస్తా

14) డైలాగ్ 14

ఒక అమ్మాయి శరీరంతో కాపురం చేస్తే సుఖంగా ఉంటుంది మనసుతో కాపురం చేస్తే సంతోషంగా ఉంటుంది

Exit mobile version