Home Health కోడిగుడ్డు, పొట్లకాయ కలిపి తింటే ఎంత డేంజర్ తెలుసా?

కోడిగుడ్డు, పొట్లకాయ కలిపి తింటే ఎంత డేంజర్ తెలుసా?

0

కోడిగుడ్డు చాల పౌష్టికాహారం, అలాగే పొట్లకాయ కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మరి అలాంటిది ఆ రెండూ కలిపి తినవద్దని డాక్టర్లు చెబుతుంటారు? అసలు అలా తింటే ఏమవుతుంది… డాక్టర్లు అలా చెప్పటానికి కారణాలేంటి తెల్సుకుందాం..

harmful food combinationsమనం తినే ఆహారాన్ని బట్టీ… మన జీర్ణాశయంలో కొన్ని రకాల ద్రవాలు, యాసిడ్లూ రిలీజ్ అవుతాయి. తిన్న ఆహారం వెంటనే జీర్ణం అయ్యేదా, లేక ఎక్కువ సమయం పట్టేదా అన్నదాన్ని బట్టీ అందుకు తగిన ఆమ్లాలు జీర్ణాశయంలో విడుదల అవుతాయి. ఐతే చాలా సందర్భాల్లో మనం రకరకాల ఆహార పదార్థాల్ని మిక్స్ చేసి తింటాం. అన్నం, కూర కలిపి తింటాం. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి యాసిడ్లు రిలీజ్ చెయ్యాలన్నదానిపై జీర్ణాశయంలో కొంత సందిగ్ధత ఉంటుంది. ఐతే, కాంబినేషన్‌తో తినే ఆహార పదార్థాలూ… అన్నీ దాదాపు ఒకే సమయంలో జీర్ణం అయ్యేవి అయితే ఏ సమస్యా ఉండదు… అదే కొన్ని త్వరగా జీర్ణం అయ్యేవి, కొన్ని ఎక్కువ సమయం పట్టేవి అయితే, అపుడు సమస్య తలెత్తుతుంది. రిలీజైన యాసిడ్లు ఆహారంతో సరిగా సెట్ కాక… యాసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.

కోడిగుడ్డు, పొట్లకాయను కలిపి తింటే గ్యాస్ ప్రాబ్లమ్స్ తప్పవు. ఎందుకంటే… పొట్లకాయ అత్యంత వేగంగా అరిగిపోయే ఆహార పదార్థం. అందువల్ల అది జీర్ణాశయంలోకి వెళ్లగానే అక్కడి యాసిడ్లతో కలిసిపోయి… కరిగిపోయి, అరిగిపోతుంది. అందుకు తగిన యాసిడ్లను జీర్ణాశయం విడుదల చేస్తుంది. కోడిగుడ్డు అలా కాదు. ఇందులో నీటి శాతం తక్కువ, ప్రోటీన్లు ఎక్కువ. అందువల్ల ఇది వెంటనే అరగదు.

దీన్ని అరిగించేందుకు ప్రత్యేక యాసిడ్లను విడుదల చెయ్యాల్సి ఉంటుంది. అవి ఎక్కువ సేపు పోరాడి గుడ్డును కరిగేలా చేసి, అరిగిస్తాయి. అంటే పొట్లకాయ, గుడ్డూ రెండింటికీ ఒకే రకమైన యాసిడ్లు పనిచెయ్యవు. వేర్వేరు యాసిడ్లను రిలీజ్ చెయ్యాల్సిందే. అందుకే గుడ్డు, పోట్ల కయ రెండింటినీ కలిపితింటే… గ్యాస్, కడుపులో మంట, ఏసీడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్లు. ఇవే కాదు…

మనం తీసుకునే ఏ ఆహారం విషయంలోనైనా ఈ రూల్స్ పాటించాల్సిందే. లేదంటే… జీర్ణాశయంతోపాటూ… పేగులకు కూడా అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు డాక్టర్లు. మరి మీరు ఎలాంటి ఆహార పదార్ధాలను కంబినేషన్లో తీసుకుంటున్నారు చూసుకుని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి బయట పడవచ్చు..

Exit mobile version