Home Health కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి రొటీన్ గా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా ?

కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి రొటీన్ గా తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు ఏంటో తెలుసా ?

0

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కొన్ని విషయాలు, పనులు సర్వసాధారణంగా మారిపోయాయి. అందులో ఆఫీసులో పని ఒత్తిడి కళ్ళకు కంప్యూటర్‌ల వల్ల శ్రమ తప్పదు. ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటీకి వచ్చిరాగానే ఇక ఫ్రెండ్స్‌తో చాటింగ్. అప్పుడు కూడా కళ్ళకు రెస్ట్‌ వుండదు. ఇవి పూర్తి కాగానే నిద్రపోదాం అని అనుకుంటూనే సమయమే తెలియకుండా టి.విని చూడటం మొదలు పెడతాం. ఇలా చేస్తే కళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి సంబంధించి ఏమైనా సమస్య వస్తే అప్పుడు ఇబ్బంది పడతారు. టీవీల ముందు, కంప్యూటర్ల ముందు గంటల తరబడీ గడపటం వల్ల క్రమంగా కంటికి సంబంధించిన సమస్యల బారిన పడతారు. సరైన నిద్రలేకపోవడంతో కళ్ళ కింద నల్లటి చారలు, కంటి చూపు తేడాగా వుండటం మరియు మందగించడం వంటివి సమస్యలు ఎదుర్కోవాలి. అంతేకాకుండా కళ్ళ మంటలు, కళ్ళ నుండి నీరు కారటం వంటివి జరుగుతుంటాయి. కళ్ళ బాధలు వేధిస్తుంటాయి. ఇలాంటి సమస్యల ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కళ్లఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాకుండా, అందమైనకళ్లను, మెరుగైన చూపును జీవిత కాలం పొందవచ్చు.

taken as a routine to improve eyesightసాధారణంగా మన శరీరంలో అవయవాలు సరీగా పని చెయ్యాలంటే వాటికి తగిన పోషక పదార్ధాలు ఇవ్వాలి. అన్నిఅవయవాలలోకీ కళ్ళు ప్రధానం అంటారు. వాటిని జాగ్రత్తగా చూసుకోవటం జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. వయస్సు పెరిగిన కొద్దీ కళ్ళ కు వచ్చే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కంటి చూపు కోల్పోవడాన్ని క్రోనిక్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువ మంది ఒక వయస్సు దాటగానే కంటి అద్దాలను వాడుతుంటారు. అయితే ఇప్పుడు చిన్న పిల్లలతో సహా కంటి అద్దాలను వాడటం సర్వ సాధారణం అయిపోయింది.

దానికి కారణం కళ్ళు ఆరోగ్యంగా లేకపోవడమే. ఇక పెద్దవారిలో పొగత్రాగుట, స్థూలకాయం కూడా ఉంటే ఈ సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆహార నియమాలలో ముందుగా కొన్నిజాగ్రత్తలు పాటిస్తే కళ్ళ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు ఆరోగ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారంలో, ల్యూటిన్, ఓమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, ఉంటే కంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అంటారు వారు. పచ్చికూరలు ఎక్కువగా తింటే మీ కంటికి మంచిది. మనకు విరివిగా లభ్యమయ్యే క్యారెట్స్ లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కళ్ళు ఆరోగ్యంగా, కంటి చూపు మెరుగుపరుచుకోవడానికి రొటీన్ గా తీసుకోవాల్సిన ఆ ఆహారాలేంటో చూద్దాం.

క్యారెట్-బెల్ పెప్పర్:

ఆరెంజ్ బెల్ పెప్పర్స్, గోబీ, బెర్రీస్, గుమ్మడికాయ, క్వాష్, స్వీట్ పొటాటో, మరియు క్యారెట్స్ వీటి ప్రత్యేకత అన్నీఆరెంజ్ రంగులో ఉండటం. వీటిల్లో విటమిన్ A, C, లూటిన్, జియాక్సిథిన్ ఉండటం మూలంగా కాంటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.

నట్స్:

నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించి కంటి ఆరోగ్యాన్ని, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్నీ కాపాడుతాయి. బెర్రీస్ లో ఉన్న ఫ్లెవనాయిడ్స్, నేచురల్ యాంటీయాక్సిండెస్ కళ్ళును సురక్షితంగా ఉంచేందుకు ఉపయోగపడుతాయి.

కోల్డ్ వాటర్ ఫిష్:

ఆస్ట్రిచెస్ వీటిని కోల్డ్ వాటర్ ఫిష్ అంటారు. వీటిల్లో డిహెచ్ ఎ అనే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన సెల్ డ్యామేజ్ లేకుండా చూసి మాక్యూలర్ డిజనరేషన్ రాకుండా ఆపటం జరుగుతుంది.

అవొకాడో:

వీటిల్లో ఉన్న లూటిన్, మాస్కులార్ డిజనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగతా పోషక పదార్ధాలు కూడా కంటికి చాలా మంచివి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్స్ లో కోకో అధికంగా ఉండటం వల్ల కళ్ళ చుట్టూ ఉండే కార్నియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి అన్ స్వీటెడ్ డార్క్ చాక్లెట్ ను రెగ్యులర్ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆకు కూరలు :

గ్రీన్ వెజిటేబుల్స్ బచ్చలి కూర, దుంప బచ్చలి. కాలే, స్విస్ చార్డ్, టర్నిప్, ఆవాలు మరియు కొల్లార్డ్ గ్రీన్ ఇవన్నీ కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అసలు పచ్చటి ఆకు కూరలేవయినా మంచివే. వీటిల్లో ఉండే లూటిన్, సెల్ డ్యామేజ్ ని అరికడుతుంది. అంతే కాదు వీటితో మస్కులార్ డిజనరేషన్, కాంటరాక్ట్స్ రాకుండా ఆపవచ్చు.

ఉల్లిపాయ:

వెల్లుల్లి, ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ గ్లూటథియొనో ఉత్పత్తి చేసే యాంటిఆక్సిండెంట్స్ కంటి చూపుకు చాలా ఉపయోగకరం.

బీట్ దుంపలు:

బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిలో కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల కాటరాక్ట్స్ ను తొలగిస్తుంది. అంతే కాదు సాధారణ కంటి చూపును మెరుగుపరిచి, కళ్ళను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడే ఐరెన్ అధికంగా ఉంటుంది.

రెడ్ వైన్:

డార్క్ చాక్లెట్ లాగే రెడ్ వైన్ లో కూడ అధికశాతంలో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి. ఇవి కార్నియాను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయం చేస్తాయి.

గుడ్లు:

వీటిల్లో ఉన్న ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ డిహెచ్ ఎ, ల్యూటిన్ మరియు జియాక్సిథిన్ కళ్ళకి చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవి తినే ముందు డాక్టర్ ని అడగటం మంచిది. ఇందులో ఉన్న బిటమిన్ బి సెల్ ఫంక్షన్ కు ఎక్కువగా ఉపయోగపడుతుంది.

బెల్ పెప్పర్:

ముదురు పసుపు వర్ణం, ఆరెంజ్ బెల్ పెప్పర్స్ వీటిల్లో విటమిన్ A, C, లూటిన్, జియాక్సిథిన్ ఉండటం మూలంగా కాంటరాక్ట్స్, మస్కులర్ డిజనరేషన్, రేచీకటి మొదలగు కళ్ళ వ్యాధులు రాకుండా రక్షణ ఉంటుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంధి. ఈ విటమిన్ లో పోషకాలు అధికంగా ఉండి కంటి కండరాలను డీజనరేషన్ చేసేందుకు సహాయం చేస్తుంది. అలాగే ఐసైట్ ను నిరోధిస్తుంది.

రెడ్ మీట్:

రెడ్ మీట్ లో అధిక శాతంలో జింక్ మరియు ఎసెన్షియల్ కాంపోనెట్స్ అధికంగా ఉండి, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ మినిరల్స్ ఎంజైమ్ లను అధికంగా ఉత్పత్తి చేయడానికి సహాయపడి, రెటినాను ఆరోగ్యంగా ఉంచుతుంది.

సోయా :

సోయా మిల్క్, సోయా సాస్, మిసో మరియు టెంఫ్ వీటిల్లో అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిండెంట్స్ ఉత్ప్రేరకాలు ఉన్న ఐసోఫ్లెవెన్స్ వల్ల కళ్ళకి వచ్చే డ్రై ఐస్ సిండ్రోమ్, కాంటరాక్ట్స్ రాకుండా కాపాడుతాయి.

ద్రాక్ష:

ద్రాక్షలో ఆంథోసైనిన్ అధికంగా ఉండి, రాత్రిల్లో కంటి చూపును స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడుల్లా ద్రాక్షపండ్లను తినండి.

టర్కీ మీట్ :

టర్కీ మీట్ లో కళ్ళకు సంబంధించి చాలా విలువైన పోషకాలు ఉన్నాయి. ఇంకా ఇందులో ఉన్న జింక్ రెటీనా ఆరోగ్యానికి ఉపయోగం.

బెర్రీస్ :

బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, మల్ బెర్రీస్, చెర్రీస్ మరియు గ్రేప్స్ ఇవన్నీకార్డియో మాస్కులర్ ఆరోగ్యానికి చాలా మంచివి. బ్లడ్ ప్రెజర్, వాపులు (inflammation) తగ్గించటానికి మంచివి. మస్కులర్ డిజనరేషన్ రావటానికి బ్లడ్ ప్రెజర్ కూడా ఒక కారణం.

గుమ్మడికాయ:

గుమ్మడికాయలో జియాథిన్ అధికశాతంలో ఉండటం వల్ల ఇది ఆప్టికల్ ఆరోగ్యానికి చాలా మంచిది.

 

Exit mobile version