Home Health మద్యం తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మద్యం తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో, రేడియోల్లో రోజూ వినిపిస్తూనే ఉంటుంది. మందు బాటిళ్లపై కూడా మద్యం సేవించడం ప్రమాదకరం అని రాసి ఉంటుంది. కానీ ఎవరైనా వింటున్నారా ? పైగా పెళ్లి.. బర్త్ డే చావు సంతోషం విచారం కోపం దుఖం బాధ ఎమోషన్ ఏదైనా మందేయాల్సిందే. చుక్క లేకుండా పండగలు పూర్తి కావు. మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Health Benefits of Alcoholఅందుకే మందు అలవాటు మాన్పించడానికి ఎన్నో అల్కో ఫ్రీ లాంటి ఔషధాలు, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఆల్కహాల్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మితిమించనిది ఏదైనా మంచిదే.. ఎంతోమంది తప్పుగా భావించే మద్యం కూడా మితంగా తాగడం మంచిదే అంటున్నారు శాస్త్రవేత్తలు.

ఆల్కహాల్ తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి నష్టం ఉండదు. పైపెచ్చు శరీరానికి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది అంటున్నారు నిపుణులు. మితంగా తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది, ఎక్కువకాలం జీవించడానికి సహాయపడుతుంది అని చెబుతున్నారు నిపుణులు. వారాంతంలో అతిగా తాగడం కంటే వారమంతా మితంగా తాగడం మంచిదని, దానివల్ల మరణాల ప్రమాదం 25% తగ్గుతుందని చెబుతున్నారు.

మద్యం పూర్తిగా మానేసిన వారి కంటే మితంగా తాగేవారు చిన్న వయస్సులో చనిపోయే అవకాశం తక్కువగా ఉంది. రోజుకి మహిళలు ఒక డ్రింక్, పురుషులు రెండు డ్రింకులు తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉదయం 9 గంటలకు వోడ్కాను తక్కువ పరిమాణంలో తినడానికి ముందు తాగితే, ప్రయోజనకరంగా ఉంటుందంట.

సాధారణంగా మహిళలు అయితే రోజుకు 1, పురుషులు అయితే రోజుకు 2 పెగ్గులకు మించి తాగరాదు. ఒక్క రోజుకు 12ఔన్సుల మందు మాత్రమే తాగితే మంచింది. బీర్ అయితే, 355 మి.లీ, వైన్ అయితే ఐదు ఔన్సులు(148 మి.లీ) లేదా 1.5 ఔన్సుల మద్యం(44.3 మి.లీ). ఈ మోతాదుల్లో తాగితే శరిరానికి ఎటువంటి ఇబ్బందీ జరగదు. కానీ పరిమితి దాటి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలగదు సరి కదా అనారోగ్యానికి దారితీస్తుంది. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇలా తగినంత మోతాదులో ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. మితంగా తాగే వ్యక్తులు సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారని అధ్యయనంలో కనుగొన్నారు. స్నేహితులతో కలిసి మితంగా సేవించే మద్యపానం మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది. వారి సామాజిక మరియు వ్యక్తిగత జీవితంలో సంతోషాలకు మితమైన కారణం అవుతుంది.

తగినంత మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వంటి సమస్యలు రాకుండా చూసుకుంటుంది. అయితే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ అయిపోయి కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అయితే గర్భిణీలు ఆల్కహాల్ తీసుకోకూడదు. అదే విధంగా లివర్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.

మితమైన మద్యపానం గుండె ఆగిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితమైన మద్యపానం గుండెపోటు, స్ట్రోక్ లేదా గట్టిపడిన ధమనులను 25% నుండి 40% వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది శరీరానికి మంచిది. కాబట్టి, మితంగా తాగుతూ శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

 

Exit mobile version