Home Health కలబందలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా ?

కలబందలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా ?

0

మనలో చాలా మంది ఇళ్లలో దానందట అదే పెరుగుతూ ఉంటుంది అలోవెరా. ఎక్కువ నీరు పొయ్యకపోయినా బతికే ఎడారి మొక్క. కానీ దానిలో ఉన్న ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అలోవెరా (కలబంద) ఓ ఔషధ మొక్క. కాస్మొటిక్, ఫుడ్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ… అలోవెరాతో అంతకుమించిన ఎన్నో ప్రయోజనాలున్నాయి.

health benefits of aloe veraకలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు. కలబందలోని ఎంజైమ్స్ ఒళ్లు నొప్పులను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. కలబందన జ్యూస్‌ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. లైంగిక పటుత్వాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచి మధుమేహాన్ని నివారిస్తుంది. కలబంద జ్యూస్ ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇలా ఎన్నో రకాల ఔషధ గుణాలున్న కలబంద గురించి మరింత తెలుసుకుందాం.

సాధారణంగా కలబందను కాలిన గాయాలు మరియు అన్నిరకాల చర్మ సమస్యలకు ఉపయోగిస్తారు. మీలో కొందరికి ఇప్పటికే కలబంద గురించిన వివిధ ఉపయోగాల గురించి తెలిసే ఉంటుంది. ఎన్నో రోగాల్ని నయం చేసే “చిరు వింత” ఈ కలబంద. ఆరోగ్యకరమైన చర్మం కోసం ఒక నమ్మకమైన ఔషధం కోసం చూస్తున్నట్లయితే, సహజ రూపంలో ఉండే కలబంద జెల్లీని ఉపయోగించడం ఎంతో మంచిది.

కలబందలో ఆమ్లజని మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. క్రిమికారకాల వలన వచ్చే చర్మ వ్యాధులతో పోరాడటానికి కలబంద సహాయపడుతుంది. కలబందలో ఉండే తేమ గుణాలు కేవలం చర్మ ప్రయోజనాలకే కాక నుదురు మరియు వెంట్రుకలకి కూడా మేలును చేకూరుస్తాయి. మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ఇత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలోనూ అలోవెరా చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. కొద్దిగా గుజ్జును తీసుకుని ఆయా ప్ర‌దేశాల‌పై రాస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

కలబంద రసాన్ని తాగడం వల్ల శరీరంలోని మలినాలను కూడా తొలగించుకోవచ్చు. శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం అలోవెరా జ్యూస్ తాగితే బయటికి వెళ్లిపోతాయి. అలాగే అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. కలబందలోని ఔషధగుణాలు రక్తంలోని చక్కర స్థాయిల్ని గణనీయంగా తగ్గించి మధుమేహ రోగులకు మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

క‌ల‌బంద గుజ్జుకు కొన్ని నీళ్లు క‌లిపి దాన్ని మౌత్‌వాష్‌గా కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో దంత స‌మ‌స్య‌లు పోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. నోట్లో ఉండే క్రిములు న‌శిస్తాయి. పాదాలు బాగా ప‌గిలిన వారు ఆ ప‌గుళ్ల‌పై క‌ల‌బంద గుజ్జును అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వ‌ర‌గా పాదాల ప‌గుళ్లు త‌గ్గుతాయి. ప్రేగు వాపు వ్యాధిలో కలబంద ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది. అదనంగా, మలబద్దకాన్ని చికిత్స చేయడానికి కలబంద గుజ్జును తినడం మంచిదని సూచించబడింది.

 

Exit mobile version