Home Health బ్లాక్ పసుపుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

బ్లాక్ పసుపుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

0

పసుపు గురించి మనకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశంలో పసుపును వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఉండటం వల్ల దీన్ని కొన్ని అనారోగ్యాలకు చికిత్సలో వాడతారు. చర్మ సౌందర్యానికి కూడా పసుపును ఉపయోగిస్తారు. అయితే మనందరికీ తెలిసిన పసుపు దుంపగా ఉన్నప్పటి నుంచే పసుపు రంగులో ఉంటుంది. కానీ పసుపు కొమ్ములు ఇతర రంగుల్లో కూడా ఉంటాయి.

Health Benefits of Black Turmericఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇటీవల ‘బ్లాక్ పసుపు కొమ్ముల’ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. బ్లాక్ పసుపుగా పిలుస్తున్నా, దీని రంగు మాత్రం బ్లూ కలర్‌లో ఉంటుంది. మనకు లభించే సాధారణ పసుపుతో పోలిస్తే దీని ధర చాలా ఎక్కువగా ఉంటుందట. బ్లాక్ పసుపు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ల చికిత్సకు కూడా దీన్ని వాడతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

ఈ మొక్క శాస్త్రీయనామం కుర్కుమా సిసియాగా చెబుతున్నారు. సాధారణ పసుపుతో పోలిస్తే కుర్కుమా సిసియా రకాల్లో దుంప మధ్యభాగం వేరే రంగులో ఉంటుందట. కడుపులో మంట, జ్వరం, కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అజీర్తి, వాంతులు, కడుపునొప్పి, దగ్గు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు.. వంటి అనారోగ్యాలకు బ్లాక్ పసుపు నివారిణిగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మహిళల్లో రుతుస్రావం సమస్యలకు దీంతో మంచి ఫలితం ఉంటుందట. అయితే అంతరించిపోతున్న ఈ ఔషధ మొక్కను పండించడం చాలా కష్టమని, దీని దిగుబడి కూడా చాలా తక్కువగా వస్తుందని ఈ రకం పసుపును పండించే రైతులు వాపోతున్నారు.

 

Exit mobile version