Home Health బ్లూ టీతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా?

బ్లూ టీతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా?

0

పొద్దున నిద్రలేచిన వెంటన టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. కానీ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఉన్న అనేక మంది ప్ర‌స్తుతం సాధార‌ణ టీ లు కాకుండా హెర్బ‌ల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మ‌న‌కు అనేక ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి వెరైటీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ బ్లూ టీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఆ మరి బ్లూ టీ విశేషాలేంటి? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

గ్రీన్ టీ, బ్లాక్ టీ, రెడ్ టీ లతో పాటు బ్లూ టీ కూడా ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ మనలో చాలామంది బ్లూ టీ గురించి తెలియదు. అయితే మిగతా వాటన్నింటి కంటే బ్లూ టీ చాలా బెటర్ అంటున్నారు దాన్ని తాగిన వారు.

Health Benefits of Blue Teaబ్లూ టీ పౌడ‌ర్‌ను Clitoria ternatea అనే మొక్క పువ్వుల‌ను ఎండ‌బెట్టి త‌యారు చేస్తారు. నిజానికి ఈ మొక్క మ‌న చుట్టు ప‌రిస‌ర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. దీని పువ్వుల‌ను తెంచి నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేయాలి. అనంత‌రం ఆ పొడిని నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. దీంతో డికాషన్ త‌యార‌వుతుంది. దాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. రుచికి అందులో నిమ్మ‌ర‌సం లేదా తేనె క‌లుపుకోవ‌చ్చు. ఈ టీ రంగుని చాలా మంది తాగేందుకు ఇష్టపడరు. కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు. ఈ టీతో అన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది. మంచి నిగారింపు కూడా వస్తుంది.

బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తలకు రక్తప్రసరణ పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. బ్లూ టీ మన మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

బ్లూ టీ తాగ‌డం వల్ల శ‌రీరంలోని వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. తద్వారా ఈజీగా బ‌రువు తగ్గుతారు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు బ్లూ టీ తాగితే మంచిది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.

 

Exit mobile version