Home Health ఆముదం వలన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆముదం వలన ఆరోగ్యానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

సనాతన ఆయుర్వేదంలో ఆముదం పాత్ర అందరికీ తెలిసిందే! ఆముదం చెట్టు గింజల నుంచి తీసే తైలం భారత దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. వాతరోగాలను పోగొట్టడంలో దీనిది అగ్రస్థానం. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో దీని పాత్ర అమోఘం. ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదం వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు, చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది.

Health Benefits of Castor oilఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లును నయం చేస్తుంది. చైనీయులు కూడా గాయాలను మాన్పడానికి దీనిని అనేక ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఆముదపు ఆకులు రసంతీసి, దానికి అల్లం రసం, నువ్వుల నూనె, ఉప్పు కలిపి సన్నని మంటపై మరిగించి వడపోయాలి. ఈ తైలాన్ని చెవిపోటుకు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

ఆముదపు గింజలు, శొంఠి కలిపి మెత్తగా నూరి, వాటిని చిన్న చిన్న ఉండలుగా తయారుచేసి, రెండు నెలలు పాటు రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున తీసుకుంటే శరీరంపై నల్లటి మచ్చలు తొలగిపోతాయట. బోదకాలను నివారణకు ఉపకరిస్తుంది. ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

మూత్రపిండాల పనితీరును కూడా ఆముదం మెరుగుపరుస్తుంది. కొద్ది మోతాదులో రాత్రిపూట తీసుకుంటే మూత్ర కోశంలోని రాళ్లు కరిగిపోతాయి.

ఆముదం, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్లకు మర్దన చేస్తే, కాళ్లలో వచ్చే మంటలు త్వరగా తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులను నివారణతోపాటు, సుఖనిద్రకు ఆముదం సహాయపడుతుంది.

వంటాముదాన్ని రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గిపోతుంది.

పూర్వపు రోజుల్లో అందరికీ జుట్టు ఒత్తుగా ఉండేది. మరియు మీరు సరిగ్గా గమనిస్తే వాళ్ల జుట్టు అంత తొందరగా తెల్లబడేది కాదు. దానికి ప్రధానమైన కారణం ఆరోజుల్లో అందరూ తలకి ఆముదం నూనె ఉపయోగించేవారు. అయితే సహజంగా ఆముదానికి ఉండే ఘాటైన వాసన మరియు చిక్కదనం వలన క్రమక్రమంగా ఈ స్థానాన్ని కొబ్బరినూనె భర్తీ చేసింది. ఈ రోజుల్లో ఘాటైన వాసన,చిక్కదనం ఎక్కువగా ఉన్న ఆముదం నూనెను ఉపయోగించాలి అన్నా మనకి కుదరదు. అయితే వారంలో కనీసం ఒక్క సారైనా ఆముదాన్ని జుట్టుకు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

ఆముదము నూనెలో రిసినోలేయిక్ ఆసిడ్ మరియు ఒమేగా -6 కలిగి ఉంటాయి. ఇది తలలో రక్త ప్రసరణను వేగవంతం చేసి జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది. అలాగే మన జుట్టుకు అవసరమైన పోషకాల అందిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలవల్ల ఇది ఫ్రీ రాడికల్ల నుంచి కాపాడుతుంది. అలాగే చుండ్రు, దురద, చర్మపు చికాకు మరియు జిడ్డుగల చర్మ వంటి వాటి నుంచి కూడా రక్షిస్తుంది.

 

Exit mobile version