Home Health అంజీరతో మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

అంజీరతో మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

భగవంతుడు మనకు ఇచ్చిన మధుర ఫలాలలో అంజీరా పండు ఒకటి. కొన్ని ప్రాంతాలలో దీన్నే అత్తి పండు అని కూడా అంటారు. ఇంగ్లీష్ లో ఫిగ్స్ అని పిలిచే ఈ పండుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంజీర పండ్లలోని విటమిన్ ఎ, బి1, బి2, క్యాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి.

Common figరక్తహీనత సమస్యతో బాధపడేవారు తరచూ ఈ పండు తింటే మంచిదంటున్నారు వైద్యనిపుణులు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి శరీరంలో రక్తం బాగా తయారైయ్యేలా చేస్తుంది. అంజీర పండ్లు ఎన్ని తిన్నా కొలెస్ట్రాల్ చేరదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఛాయిస్. భోజనానికి ముందు కొన్ని అంజీర ముక్కల్ని తినడం వల్ల పొట్ట నిండినట్టుగా అనిపించి భోజనం తక్కువ తింటారు. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గొచ్చు.

ఈ వేసవికాలంలో చాలామందికి శరీరంలో వేడి అధికంగా ఉంటుంది. అలాంటివారు ఉదయాన్నే పరగడుపున అంజీర పండ్లను తింటుంటే శరీరానికి చలువ చేస్తుంది. ఇక అంజీరలో అధికంగా లభించే పీచు మూలంగా అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్దులకు ఎదురయ్యే జీర్ణ సంబంధిత సమస్యలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఒకవేళ పైల్స్ సమస్య వేధిస్తుంటే… రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీరలను వాటర్‌తో సహా తింటే పైల్స్ తగ్గిపోతాయి.

అంజీర ఆకులు మరియు పండ్లు షుగరు పేషెంట్లకు అల్పాహారం క్రింద ఇవ్వొచ్చు. ఇన్సులిన్ మోతాదును క్రమబద్ధీకరించుటలో వీటి పాత్ర అధికం. బ్లడ్ లో షుగర్ ను కంట్రోల్ చెయ్యగల పొటాషియం ఈ ఆకులలో లభిస్తుంది. ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం కూడా అంజీరలో అధిక మోతాదులో ఉంది.

లైంగిక సమస్యలు, సంతాన భాగ్యం కలగనివారికి అంజీరలు అద్భుతంగా పనిచేస్తాయి. పూర్వకాలం నుండి కూడా అంజీరాను సెక్సు బలహీనతలు ఉన్నవారికి వాడేవారు. ఎండు అంజీరాలను రాత్రంతా పాలల్లో నానబెట్టి పరగడుపున సేవిస్తే పురుషులలో సెక్సు సామర్ధ్యం బాగా పెరుగుతుంది.

Exit mobile version