Home Health మొక్కజొన్న వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మొక్కజొన్న వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

చిన్న చిన్నగా చిరు చినుకులు పడుతున్నప్పుడు, వేడి వేడి మొక్కజొన్న కంకి తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. వర్షాలు పడుతుంటే మొక్కజొన్న పొత్తులు తినడానికి మనసు పరుగు పెడుతుంది. మిగతావాటితో పోలిస్తే మెుక్కజొన్న అతి చౌకగా లభించే ఆహారం. దీన్ని నిప్పులపై కాల్చుకొని తినొచ్చు లేదా ఉడకబెట్టుకొని కాస్త నిమ్మరసం తగిలించి తిన్నా మంచి రుచిగా ఉంటుంది. చెబుతుంటేనే నోరు ఊరించే మెుక్కజొన్న గింజల నుండి పాప్ కార్న్, కార్న్ ఫ్లేక్స్ కూడా తయారుచేస్తారు.

Health benefits of cornమెుక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. పూర్వం మొక్కజొన్న గింజలతో గడ్క చేసుకొని తినేవారు ఇది చాలా బలమైన ఆహారపదార్ధం. మొక్కజొన్న రోటీ నుండి కాంటినెంటల్ సలాడ్ వరకు, మొక్కజొన్నను మనం తినే ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకుంటాము. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి.

తక్కువ ధరకే విరివిగా లభించే మొక్కజొన్న పొత్తులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మొక్కజొన్న జీర్ణక్రియకు బాగా పని చేయడంతో పాటు మలబద్ధకం, మొలలు సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. మొక్కజొన్నలో ఉండే ఫోలిక్ యాసిడ్ రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. ఈ మొక్క జొన్నలో ఇది కాకుండా, విటమిన్ ఎ కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బాడీలో పెంచడమే కాకుండా మనల్ని చాలా బలంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

వీటితో పాటు మెుక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి1, బి6, నియాసిన్, రైబోఫ్లోవిన్ అనే విటమిన్లు ఎక్కువగా ఉన్నాయి. మొక్కజొన్న రక్తకణాల్లో కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షవాతం బీపీ మొదలైన వాటి సమస్యలు అదుపులో ఉంచుతుంది. మొక్కజొన్న తరచుగా తినడం వల్ల హైపర్టెన్షన్ కూడా దూరం అవుతుంది. బీపీ షుగర్ గుండె జబ్బులు అన్నిటికీ సరైన ఆహారం మొక్కజొన్న.

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న గింజలతో తయారైన నూనెను చర్మానికి రాస్తే చర్మ మంటలు, ర్యాష్ తగ్గే అవకాశం ఉంటుంది. మొక్క జొన్నలో విటమిన్ బి అనేది పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ బి జుట్టు ఇంకా ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మొక్కజొన్న తింటే జుట్టు సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు జుట్టు షైనింగ్ గా ఉంటుంది.

మొక్కజొన్న తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్ధం. దీనిని తినడం వలన ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఖనిజాలు పోషకాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. మొక్కజొన్న హెయిర్ ఫోలీ సెల్స్‌ కు బలాన్ని చేకూర్చడంలో సహాయపడుతుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. పేగు క్యాన్సర్ ను అరికట్టడంలో మొక్కజొన్న సహాయపడుతుంది. మధుమేహంతో బాధ పడేవాళ్లు మొక్కజొన్నను తీసుకుంటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

ఇక మొక్కజొన్నలో యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది ఎలాంటి మంటను అయినా వెంటనే తగ్గిస్తుంది. అలాగే మనలో వుండే ఒత్తిడిని కూడా వెంటనే నివారిస్తుంది. మొక్క జొన్నలో కెరోటినాయిడ్స్, లుటిన్ ఇంకా జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు మన కళ్ళను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకా ఇది వృద్ధాప్య ప్రక్రియను కూడా వెంటనే తగ్గిస్తుంది. అందుకే వర్షాకాలంలో మొక్కజొన్నలు ఖచ్చితంగా తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

Exit mobile version