Home Health దొండ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

దొండ ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

ఈరోజుల్లో తినడానికి ఎన్నో రకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నాయి, అవి తినడం వలన ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. అయితే మనం తీసుకునే ప్రతి ఆహరం ద్వారా ఎన్ని పోషక విలువలు మన శరీరంలోకి చెరుతున్నాయన్నది తెలుసుకోవడం కూడా మన డ్యూటీనే. మార్కెట్లలో లభ్యమయ్యే ఆరోగ్యకరమైన కూరగాయలలో దొండ ఒకటి. గ్రామాల్లో అయితే దీనిని తీగదొండ అంటారు. గ్రామాల్లో దాదాపు చాలా మంది ప్రజల ఇంటిలో ఈ చెట్టు ఉంటుంది.

Health Benefits Of Donda Chettuమనం సాధారణంగా దొండకాయలతో వేపుళ్లు,కూర చేసుకుంటూ ఉంటాం. అయితే దొండకాయను కొంతమంది ఇష్టంగా తింటారు. కొంతమంది తినటానికి ఇష్టపడరు. కానీ దొండకాయ మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా సహాయ పడడమే కాదు ఈ దొండ కాయ ఆకులు పిందెలు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. చాలా మంది పచ్చివి కూడా తింటారు.. ఇలా పచ్చివి తింటే.. దొండకాయ తో మంచి పోషక విలువలు లభిస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, బి 1, సి, కాల్షియం అధికంగా ఉంటాయి.

దొండకాయలో మెదడు, నాడీ వ్యవస్థ పని చేసే విటమిన్లు పుష్కలం గా లభిస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. దొండ కాయ తినడం తో మొదడు యొక్క జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలసట, పని ఒత్తిడి తగ్గించి మెదడు చురుకు గా పనిచేస్తుందని అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి, అధికం గా ఉంటాయి.. ఇవి శరీరం లో క్యాన్సర్ కణాల ను నాశనం చేస్తాయి. తరచూ ఈ దొండ కాయ తింటే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.

అలాగే దొండ ఆకులో కూడా ఎన్నో అవసరమైన పోషక విలువలు ఉన్నాయి. దొండ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.ఆయుర్వేదంలో దొండ ఆకును ఎక్కువగా ఉపయోగిస్తారు. దొండ ఆకు రసాన్ని 20 గ్రాములు ప్రతి రోజు నెల రోజుల పాటు తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ దొండ ఆకు రసం మధుమేహ రోగులకు బాగా పనిచేస్తుంది.

దొండ ఆకుల రసంలో వెల్లుల్లి రసం,ఆవాల పొడి వేసి బాగా కలిపి 3 గ్రాముల మోతాదులో ఉండల్లా చేసి మూడు పూటలా ఒక్కో ఉండను నీటితో తీసుకుంటే మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. అయితే దొండ ఆకురసం,ఆవాల పొడి,వెల్లుల్లి రసం మూడింటిని సమానమైన మోతాదులో తీసుకోవాలి. 50 గ్రాముల గేదె పెరుగులో 20 గ్రాముల దొండ ఆకురసాన్ని కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.

దొండ ఆకులలో అధిక మొత్తం లో ఐరన్ ఉండడంతో గర్భణీ స్త్రీల కు మంచి పోష కాహారం.. గజ్జి లాంటి చర్మ వ్యాధులకు దొండకాయ ఆకుల ను పేస్ట్ లా చేసి చర్మం పై పూత గా వేసుకొంటే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ముఖం పై ఉండే మచ్చలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు. దొండ ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని వాటిని దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని అరికాళ్లకు రాస్తే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి. రోజులో రెండు సార్లు రాస్తే తగ్గిపోతుంది.

ఇది రోగనిరోధక శక్తి ని కూడా పెంపొదిస్తుంది. దొండ ఆకు రసాలను నీటిలో తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అంతేగాక.. విరేచనాల సమస్యను కూడా ఇది నివారిస్తుంది. దొండ ఆకు రసాన్ని రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. దొండ ఆకులను చూర్ణంగా చేసి నుదుట రుద్దడం వలన తలనొప్పిని కూడా అరికట్టవచ్చు.

Exit mobile version