Home Health రాగి పాత్రలో నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రాగి పాత్రలో నీటిని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

ఇప్పుడంటే నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వచ్చాయి కానీ పూర్వం మన పెద్దలు రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి తాగేవారు. రాగి పాత్రల్లో నిల్వ చేస్తే నీరు నిజంగానే ప్యూరీఫై అవుతుందా? అసలు రాగి పాత్ర వల్ల ఏంటి లాభం? ఈ సీక్రెట్ తెలిస్తే మీరు ఇక రోజు రాగి పాత్రల్లోనే నీళ్లు తాగుతారు. అవును! రాగి పాత్రల్లో నీటిని వేస్తే.. సూక్ష్మ జీవులు నాశనమవుతాయని పరిశోధకులు ఆధారలతో సహా చెప్తున్నారు. ఇప్పుడు మంచి ఆరోగ్యం కోసం రాగి పాత్రలనే సిఫార్సు చేస్తున్నారు.

health benefits of drinking water in copper vesselరాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయాన్నే తాగడం ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం ఎప్పటి నుండో చెబుతోంది. అందుకే మన పూర్వికులు నీటిని తాగడానికి రాగి పాత్రలనే ఎక్కువగా ఉపయోగించేవారు. రాగి ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నాం సరే… అది ఏ రకంగా మంచి చేస్తుంది? ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? తెలుసుకుందాం.

1. రాగి క్యాన్సర్ సమస్యను తగ్గిస్తుంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడతాయి.

2. రాగి పాత్రలో నీరు ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేయడానికి రాగి సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును కూడా రాగి నీరు మెరుగుపరుస్తుంది.

3. రాగి పాత్రలోని నీరు శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది.

4. రాగి పాత్రలో నీటికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే సామర్థ్యం ఉంది. అది గాయాలు త్వరగా మానేందుకు సహాయపడుతుంది. అలాగే కొత్త కణాల ఉత్పత్తికి రాగి దోహదం చేస్తుంది.

5. తరచూ రాగి పాత్రలో నీటిని తాగేవారికి త్వరగా చర్మం యవ్వనంగా ఉండి, వృద్ధాప్య ఛాయలు రావు. చర్మ వ్యాధులు, రక్తహీనత సమస్యలు కూడా తగ్గిపోతాయి.

6. రాగి పాత్రలోని నీరు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేందుకు సహకరిస్తుంది. కాలేయం, కిడ్నీలు చక్కగా పనిచేసేందుకు సహాయపడుతుంది.

7. రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీరు బాగా ఉపయోగపడుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి.

8. అజీర్తి, కడుపులో మంట, ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితం ఉంఉంది. శరీరంలోని హానికారక బ్యాక్టీరియా నాశనమై జీర్ణక్రియ వేగవంతమవుతుంది.

మార్కెట్లో ఇప్పుడు రాగితో తయారు చేసిన బాటిళ్లు, చెంబులు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ఫ్యూరిఫైర్లు సైతం ఇప్పుడు రాగితోనే వస్తున్నాయి. ఇతర మెటల్స్ తో పోల్చితే రాగి పాత్రలు కొంచెం ఖరీదైనవే. కానీ ఆరోగ్యానికి మించిన ఆస్తులేవీ లేవు కదా! అందుకని ఇప్పటి నుండే రాగి పాత్రల్లోని నీటిని తాగడం మొదలుపెట్టండి

Exit mobile version