వర్షాకాలం సీజన్ లోనే మార్కెట్ లో కనిపించే ఆల్ బుఖారా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చూడటానికి ఎరువు రంగుతో పాటు నీలం రంగులో కూడా కనిపిస్తాయి. ఈ పండ్లు కాస్త తియ్యదనంతో కాసింత పుల్లగా తినడానికీ, చూడటానికీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నిజానికి ఇవి మన దగ్గర పండవు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లలో ఎక్కువగా పండుతాయి.
ఈ పండును తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆల్ బుఖారా పండ్లను తినడం వల్ల.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే వెంటనే మార్కెట్ కు వెళ్లి వాటిని కొనుక్కొని తినేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కణాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు.
మధుమేహం ఉన్నవాళ్లు కళ్లు మూసుకొని ఈ పండును తినేయొచ్చు. మధుమేహం లేదా షుగర్.. ఈ వ్యాధి ఉన్నవాళ్లు.. ఆల్ బుఖారా పండ్లను ఈ సీజన్ లో ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే.. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దాని వల్ల.. శరీరంలోని రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి.
ఆల్ బుఖారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే ఆలూబుఖరా పండు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ భయాలను నివారిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఈ పండును నిత్యం తీసుకుంటే.. హార్ట్ స్ట్రోక్స్ కూడా రావు.
చాలామందికి జీర్ణ సమస్యలు, మలబద్ధకం లాంటి సమస్య ఉంటుంది. అటువంటి వాళ్లు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ ను తినాల్సిందే. ఇందులో ఉండే.. ఇసాటిన్, సార్బిటాల్ అనే పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇది ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎండిన పండ్లను తినాలి.
ఆల్–బుఖారాలో ఫ్రీ–రాడికల్స్‌ను అరికట్టే గుణం ఉంది. ఈ పండు నుంచి లభ్యమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్‌తో అది ఎన్నో రకాల క్యాన్సర్లను అరికడుతుంది. ఈ పండును ఆకర్షణీయంగా కనిపించేలా చేసే ఎరుపు రంగు పిగ్మెంటే ఫ్రీ–రాడికిల్స్‌ను నిర్వీర్యం చేస్తుంది. తద్వారా క్యాన్సర్లను అరికడుతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణవ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, శ్వాస వ్యవస్థకు వచ్చే క్యాన్సర్లు (రెస్పిరేటరీ క్యాన్సర్లు), నోటి క్యాన్సర్లను నివారిస్తుంది.
వాటిలో మెగ్నిషియంతో పాటు ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అలాగే.. రక్త ప్రసరణ కూడా మెరుగు అవుతుంది. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అది శరీరంలోని కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే.. బోరాన్ ఎముకలను ధృడంగా చేస్తుంది.
ఈ పండులో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ పండులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని నిరోధించడానికి సహాయపడుతుంది.