Home Health తోటకూర తినడం వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

తోటకూర తినడం వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుతున్న తోటకూరలో లెక్కలేనన్ని పోషకాలు ఉన్నాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు ఒక్కతోట కూరలోనే లభిస్తాయి.

health benefits of eating thotakuraఅయితే తోటకూర గడ్డిలా ఉంటుందనే కారణంతో చాలామంది దీన్ని దూరం పెడుతున్నారు. దాంతో శరీరానికి లభించే ఎన్నో పోషకాలను మిస్ అవుతున్నారు. మనం తినే ఆహారంలో తోట కూరను చేసుకోవడం వలన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..

తరచూ తోటకూరను తినడం వల్ల బరువు తగ్గిపోవచ్చు. శరీరంలోని అనవసరమైన కొవ్వును ఇది హరిస్తుంది. తక్షణ శక్తికి తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుని తిన్న తోటకూర అయితే చాలా ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.

  • ఇది అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుంది.
  • హైపర్ టెన్షన్‌తో బాధపడేవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
  • తోటకూరలోని ‘విటమిన్ సి’ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.

  • తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు పై ఉన్న చుండ్రు తగ్గుతుంది.
  • కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి.
  • ఇవి రక్తనాళాన్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలుచేసి సోడియం, పొటాషియం వంటివన్నీ సమకూరుతాయి.

  • విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు.. ఇవన్నీ సమకూరుతాయి.

 

Exit mobile version