భారతీయులకు బీరకాయతో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వీటితో రకరకాలుగా వంటలు వండుకోవచ్చు. బీరతో ఎన్ని రకాల వంటలు చేసినా అమోఘం అని చెప్పాలి. ప్రత్యేకమైన రుచితో ఉండే ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ బీరకాయ ముందుంటుంది.
బీరకాయల్ని ఎవరూ ప్రత్యేకంగా కొనరు. ఎందుకంటే వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై పెద్దగా ప్రచారం జరగట్లేదు. నిజానికి బీరకాయలలో విటమిన్లు, మినరల్స, షుగర్స్ మాత్రమే కాదు… యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి.
మద్యం సేవించేవారు బీరకాయ తింటే లివర్ పదిలంగా ఉన్నట్టే. ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ దెబ్బ తింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వారు బీరకాయ తింటే ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న లివర్‌ను రక్షిస్తుంది .అందుకే మందుబాబులు తీసుకునే ఆహారంలో బీరకాయ చేర్చితే వారి లివర్‌కి ఎలాంటి ఢోకా ఉండదు
అంతేకాదు బీరకాయల్లో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం సమస్యల్ని తొలగిస్తుంది. అలాగే… తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఈ రోజుల్లో మనం తినే బయటి ఫుడ్ వల్ల మన బాడీలో రకరకాల నూనెలు, జిడ్డు పదార్థాలు… పేగులు, ఆహార నాళాలకు అతుక్కుపోతూ ఉంటాయి. వాటిపై బ్యాక్టీరియా ఇతర క్రిములు ఏర్పడి, అవి మన జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండేందుకు, వారానికి రెండుసార్లైనా బీరకాయను వండుకొని తినాలి. ఇది పొట్టను చల్లగా చేసి ఎంతో హాయిని ఇస్తుంది.
కేవలం పొట్ట మాత్రమే కాదు మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బీరకాయలు తినాలి. అయితే వీటిని తింటే కవల పిల్లలు పుడతారన్నది అపోహ మాత్రమే. అలా ఎక్కడా ప్రూవ్ కాలేదు. కాబట్టి ఈసారి మార్కెట్‌కి వెళ్తే, ఇతర కూరగాయలతోపాటూ… బీరకాయల్ని కూడా లిస్టులో చేర్చుకొండి.