Home Health మెంతి ఆకు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మెంతి ఆకు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మనదేశంలో మెంతులకంటే కూడా మెంతికూరను అధికంగా ఆహారంలో ఉపయోగిస్తారు. వీటిలో పోషకాలు ఎక్కువ. పచ్చటి మెంతికూర ఆకు ఎంతో రుచికరంగాను, ఔషధ విలువలు కలిగి ఉంటుంది. ముఖ్యంగా మెంతి ఆకులను చలికాలంలో తప్పనిసరిగా తినాలి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే బాధ నడుము నొప్పి మెంతికూర తినడం వల్ల నడుము నొప్పి నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.

Health Benefits of Eating Menthi Leafఇంకా పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు స్త్రీ పురుషుల లైంగిక సమర్థతను, లైంగిక ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. ముఖ్యంగా మెంతి ఆకు రెగ్యులర్ గా తినడం వల్ల లివర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గ్యాస్, పేగుల్లో ఏర్పడే సమస్యలు తొలగిస్తుంది. శ్వాస కోసం వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఈ ఆకుకూరలో ఐరోన్ పుష్కాలంగా ఉంటుంది.దీని ద్వారా శరీరంలో రక్తహీనతను ఇది దూరం చేస్తుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

అన్ని ఆకుకూరల కంటే మెంతాకు వల్ల కలిగే ప్రయాజనలే ఎక్కువ. మెంతి కూరలో కెలోరీలు చాలా తక్కువ.పీచు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రోజు ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు కూర తినడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయదు. అందువల్ల బరువు పెరుగుతామని భ్రమలో ఉండనవసరం లేదు. కంటి చూపుకు మెంతికూర ఎంతో మేలుచేస్తుంది. జీర్ణశక్తిని పెంచే శక్తి ఈ ఆకుకూరకు ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్యమే కాదు అందాన్ని కాపాడుకోవడంలో కూడా ఈ ఆకులు చాలా అద్భుతంగా పని చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మెరుపుగా మృదువుగా చేస్తాయి. టీనేజ్ లో వచ్చే మొటిమలు,వాటి తాలూకు మచ్చలు పోవాలంటే మెంతి ఆకులను మెత్తని ముద్దగా చేసి ముఖానికి రాసి అరనివ్వాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు మూడు సార్లు చేస్తే చర్మం అద్భుతంగా తయారు అవుతుంది.

మెంతులలో కావలసినంత పీచు పదార్థాలు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు విటమిన్ – సి, బి1, బి2, కాల్షియం, విటమిన్ – కె, కూడా ఉంటాయి. ఈ ఆకులను ఎండబెట్టి కూడా కొన్ని ఆహార పదార్థాలలో వాడవచ్చు. ఎండిన ఆకులు సైతం ఎంతో మేలు చేస్తాయి. మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే షుగర్ వ్యాధి నియంత్రణకు మంచి ఫలితాలనిస్తుంది. మెంతిలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ కూడా ఉంటాయి. ఇవి వెంట్రుకల చక్కటి ఎదుగుదలకు తోడ్పడతాయి.

కనుక కేశ సౌదర్యం కోరే మహిళలకు ఈ ఆకుకూర ఒక వరంగా భావించాలి. తెల్లజుట్టును నివారించ‌డంలో మెంతి ఆకు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. ముందుగా మెంతి ఆకు మ‌రియు క‌రివేపాకు స‌మానంగా తీసుకున మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో నిమ్మ ర‌సం క‌లిపి త‌ల‌కు, జుట్టు మొత్తానికి ప‌ట్టించాలి. ముప్పై, న‌ల‌బై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్ర‌మంగా న‌ల్ల బ‌డుతుంది.

అలాగే ఒక క‌ప్పు మెంతి ఆకుల‌ను తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మెంతి ఆకుల పేస్ట్‌లో రెండు స్పూన్ల కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు, జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించి అర గంట పాటు వ‌దిలేయాలి. ఆ త‌ర్వాత కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది.

ఇక ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి అందులో ఒక క‌ప్పు మెంతి ఆకుల‌ను వేసి రాత్రంతా నాన బెట్టుకోవాలి. ఉద‌యాన్నే మెంతి ఆకుల‌ను పేస్ట్ చేసుకుని అందులో పెరుగు మరియు బాదం ఆయిల్ వేసుకుని క‌లుపుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టించి ముప్పై నిమిషాల అనంత‌రం హెడ్ బాత్ చేయాలి. నాలుగు రోజుల‌కు ఒకసారి ఇలా చేసినా జుట్టు న‌ల్ల‌బ‌డుతుంది. కొందరికి జుట్టు ఎక్కువగా ఉడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు తాజా మెంతి ఆకులను మిశ్రమంగా చేసి తలకి పట్టించాలి. దాన్ని అరగంట సేపు అరనిచ్చి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

 

Exit mobile version