Home Health ముల్లంగి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

ముల్లంగి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

దుంపలు అంటే చిన్నచూపు చూసేవారు అత్యధికం. దుంపలు తింటే దుంప తెగుతుందనే అవగాహన రాహిత్యంతో మనలో చాలామంది ముల్లంగి (radish) సుగుణాలు తెలియక ఈ కూరగాయను దాదాపు దూరంగా పెడుతున్నారు. ఉత్తరాది ప్రజలైతే ముల్లంగిని అత్యంత ఇష్టంగా తింటారు. ముల్లంగి సలాడ్లు (radish salad) విపరీతంగా లాగించే నార్త్ ఇండియన్స్ కు మూలీ పరోఠా అత్యంత ఇష్టమైన ఆహారం. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే ముల్లంగితో చాలా వెరైటీలు చేసుకోవచ్చు.

Health benefits of eating radishఇక దక్షిణాది విషయానికి వస్తే కేవలం సాంబార్, కూర, పచ్చడి తప్పితే ఇతర రూపాల్లో పెద్దగా మనవారు ముల్లంగి తినరు. పోషకాహార నిపుణుల సలహాతో ఇప్పుడిప్పుడే మనవారు ముల్లంగిపై అపోహలు తొలగించుకుంటున్నారు. అయితే ముల్లంగి తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే తినకుండా ఉండలేరు.

హై బీపీ ని తగ్గిస్తుంది:

అధిక రక్తపోటు తో బాధ పడే వారికి ఇది దివ్యౌషధం అనే చెప్పొచ్చు. ముల్లంగి లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, బి6 , పొటాషియం ఇతర మినరల్స్ ఇందులో ఉంటాయి.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది :

ముల్లంగి రోగ నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని న్యూట్రిషనిస్ట్స్ చెబుతున్నారు.

డయాబెటిస్ అదుపులో ఉంటుంది :

ముల్లంగి వల్ల చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి లభిస్తాయి. దీనితో ఇది చాలా రకాల సమస్యలు తరిమి కొడుతుంది. ముఖ్యంగా రక్తపోటు మరియు లివర్ కి ప్రయోజనాన్ని ఇస్తుంది. ముల్లంగి లో కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి మరియు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.

చర్మ సమస్యలను తగ్గిస్తుంది :

ముల్లంగిని తరచు ఆహారంలో చేర్చుకోవడం వల్ల దురద వంటి కొన్ని చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాదు ముల్లంగి లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. దీనితో ఇది బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఇలా ఒకటా, రెండా ఎన్నో ప్రయోజనాలు ముల్లంగి ద్వారా మనకి కలుగుతాయి. ముల్లంగిని నచ్చిన వాటిలో వేసి మంచి వంటలు వండుకోవచ్చు. దీని వల్ల ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. పైగా ముల్లంగిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ముల్లంగి మార్కెట్ లో ఎక్కువగానే దొరుకుతుంది కాబట్టి వీలైనప్పుడు కొనుగోలు చేసి డైట్ లో చేర్చుకోండి. దీంతో చాలా సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి అని న్యూట్రీషనిస్టులు అంటున్నారు.

 

Exit mobile version