Home Health చిలకడ దుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

చిలకడ దుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

0

సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో చిలగడదుంపలు ఒకటి. ఈ దుంపలు చాలా రుచిగా ఉంటాయి. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Sweet Potatoచిలగడదుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ బీట్‌ని సరి చేసేందుకు సాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలోని కండరాల, నరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. చిలగడదుంపల్లో బీటా కేరోటిన్, విటమిన్ ఈ, సీ, బీ 6, ఐరన్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువగా మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా గ్లైకెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.

చిలగడదుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని చలికాలంలో తినడం వల్ల ఈ సీజన్‌లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

షుగర్ పేషెంట్స్‌ దుంపలు తినడం మంచిదని చెబుతారు. వీటిలో ఉండే గుణాలు షుగర్ పేషెంట్స్‌కి మేలు చేస్తాయని చెబుతారు. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ పేషెంట్స్ వీటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

చిలగడదుంపల్లో శరీరానికి అవసరమయ్యే మినరల్స్, ఐరన్ శాతాలు అధికంగా ఉంటాయి. ఇవి కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదే విధంగా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కూడా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సెడెంట్స్‌లా పనిచేస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తగ్గించి వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయి. అందువల్ల మీరు యంగ్‌గా కనిపిస్తారు.

చిలగడదుంపలను రెగ్యులర్‌గా తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా స్కిన్ టోన్ కూడా మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇందులోని మెగ్నీషియం కూడా గుండె ధమనులకు చాలా మంచిది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలకు అలసట నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

చిలగడదుంపల్లోని ప్రత్యేక గుణాలు గాయాలు అయినప్పుడు వాటిని త్వరగా తగ్గించేలా చేస్తాయి. చిలగడదుంపల్లో ఎక్కువగా శరీరానికి మేలు చేసే గుణాలు ఉండడం వల్ల ఇవి శరీరంలో ఉండే క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయని తేలింది. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.

 

Exit mobile version