Home Health ఎర్ర బెండకాయలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎర్ర బెండకాయలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

బెండకాయలు అంటే తెలియని వారుండరు. బెండకాయలు ఎక్కువగా తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందని, లెక్కలు బాగా వస్తాయని చిన్నప్పుడు చెప్పడం వినే ఉంటాం. అంతేకాదు పెద్దలకైతే కీళ్ల నొప్పుల నుంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెబుతారు. ఇక పులుసు, కూర, ఫ్రై ఇలా బెండతో అనేక రకాల కూరలు వండుతారు. ఇక బెండ ఆవకాయ కూడా కొందరు పెడుతున్నారు. ఇక బెండకాయ బజ్జీలు కూడా తినేవారు ఉన్నారు.

Health Benefits of Erra Bendakayaబెండకాయ తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అసలు బెండకాయ అంటేనే పోషకాల గని. అందులో ఫైబర్‌ పుష్కలం. బెండకాయ తరుచూ తింటే మలబద్ధకం లాంటి సమస్యలు రానేరావు. అలాగే బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలూ అనేకం. కొలెస్ట్రాల్‌కూడా నియంత్రణలో ఉంటుంది. మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందుకే, బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని అంటారు.

అయితే సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలను కూరగా వండుకుంటారు. కానీ ఇప్పుడు ఎర్ర బెండకాయలు మార్కెట్లో కి వస్తున్నాయి. ఆకుపచ్చని బెండకాయల కన్నా ఎర్ర బెండకాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ బెండకాయలు ఎక్కువగా చలి ఉన్న ప్రాంతాల్లో పండుతాయి. వీటికి ఎండ తాకితే కాయవు. అందుకే వీటికి ఎండ తాకకుండా.. అవి పెరగడానికి అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించి.. తెలంగాణలో సాగు చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం వరంగల్ కు చెందిన ఓ రైతు మాత్రం సాగు చేస్తున్నాడు. మార్కెట్ లో ఈ బెండకాయకు బాగా గిరాకీ వస్తోందట. ఈ బెండకాయలకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందట. ఉత్తరప్రదేశ్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెజిటెబుల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఈ రకాన్ని అభివృద్ధి చేశారు. రైతుల్లో అవగాహన లేకపోవడంతో పెద్దగా పండించడం లేదు. దీంతో, ధర కొంత ఎక్కువగానే ఉంటున్నది. అయితేనేం, పోషక విలువలు మాత్రం అనేకం.

రక్తహీనత సమస్యను తగ్గించటానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక పోషకాల విషయానికి వస్తే విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలాసిన్ మరియు ఇతర బి విటమిన్లు,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం,ఫైబర్ సమృద్దిగా ఉండికేలరీలు తక్కువగా ఉంటాయి. ఎర్ర బెండకాయలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఎర్ర రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తాయి. ఇందులోని ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

బరువు తగ్గడంతో సాయపడతాయి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతాయి. పైగా ఎర్ర బెండకాయ వండిన తర్వాత మాత్రం ఎర్రగా ఉండదట.ఇంకేం ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎర్ర బెండకాయలు కనిపిస్తే తప్పనిసరిగా తెచ్చుకోండి. అలా అని ఆకుపచ్చని బెండకాయలను మానేయాల్సిన అవసరం లేదు ఒకసారి అవి తింటే మరొకసారి ఇవి తింటే సరిపోతుంది.

 

Exit mobile version