Home Health నేల ఉసిరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నేల ఉసిరి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

పొలాల గట్ల మీద, ఇంటి ఆవరణలో కనిపించే ఎన్నో మొక్కలను పిచ్చి మొక్కలుగా అనుకుంటాం… కానీ వీటి ఔషధ విలువలు ఔరా అనిపిస్తాయి. అలాంటి మొక్కే నేల ఉసిరి. మొక్క చూడటానికి ఉసిరి చెట్టు అలాగే ఉంటుంది కాకపోతే ఉసిరి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాని నేల ఉసిరి చిన్న మొక్కలా మాత్రమే ఉంటుంది. ఇది కేవలం 3 నుంచి ఐదు సెంటీమీటర్లు ఎత్తు మాత్రమే పెరుగుతుంది అందుకే దీనిని నేలఉసిరి అని అంటారు.

Health Benefits Of Gale of the windనేల ఉసిరిని తమిళంలో కీలనెల్లి అని కూడా పిలుస్తారు. దీనికి మరో పేరు ఏక వార్షిక మొక్క ఎందుకంటే దీని జీవిత కాలం ఒక సంవత్సరం మాత్రమే. దీనినే భూమి ఆమ్లకి అని కూడా అంటారు. సంస్కృతంలో భూమిమలకి, కన్నడలో నెలనెల్లీ, హిందీలో భూమి ఆమ్లా, మలయాళంలో కిజానెల్లి అంటారు. ఈ మొక్కను బహుఫల మరియు బహుపత్ర మొక్కలు అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో ఎక్కువ పత్రాలు, ఆకులు వెనక చిన్న చిన్న ఫలాలు కలిగి ఉంటాయి.

ఇది మూత్రపిండాల్లో రాళ్లను తొలగిస్తుంది. నేల ఉసిరి మొక్క 20 నుండి 25 అంగుళాల ఎత్తుకు పెరుగుతుంది. ఈ మొక్కలు తమిళనాడులో ప్రతిచోటా కనిపిస్తుంది. ఇది అద్భుతమైన ఔషధ ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన మొక్క. కాలేయ వ్యాధులు మరియు మూత్రపిండాల రాళ్ళ చికిత్స నుండి జుట్టు పెరుగుదలకు సహాయపడటం వరకు, ఈ మొక్క విస్తృత ఉపయోగాలను కలిగి ఉంది.

దీనికి గల ఇంకొక పేరు స్టోన్ బ్రేకర్ ఎందుకంటే ఈ మొక్కలు ఎముకలు విరిగినప్పుడు ఉపయోగిస్తారు. ఎముకలు విరిగినప్పుడు ఈ మొక్కను వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసి మెత్తగా నూరి విరిగిన దేశంలో ఉంచి కట్టుకట్టినట్లయితే అక్కడ నొప్పి వాపు తగ్గి విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ఈ మొక్కలో కాల్షియం, సోడియం, పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, ఫెర్రస్ మరియు రాగి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఆయుర్వేదం మరియు హోమియోపతిలో విస్తృతంగా ఉపయోగించబడింది. సాంప్రదాయకంగా, ఇది కామెర్లు, హెపటైటిస్, మూత్రపిండాల్లో రాళ్ళు, జుట్టు సమస్యలు, ఉబ్బసం మరియు జ్వరాల చికిత్సకు ఉపయోగించబడుతుంది.

నేల ఉసిరి మొక్కలో కాల్షియం ఆక్సలేట్ ను కరిగించే శక్తి ఉండటం వలన మూత్రపిండాలలోని రాళ్లు ఇది కలిగిస్తుంది. నేల ఉసిరి మొక్కను ఒక కషాయంలా చేసుకొని తాగడం వల్ల మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి. మనుషుల్లో హెపటైటిస్‌-బి వైరస్‌ని అరికట్టడానికి ఈ ఔషధం ఉపయోగిస్తారు. బాక్టీరియా, ఫంగస్‌ల్ని కూడా అరికడుతుంది.

అంతేకాక లివర్‌కి రక్షణగా, అతిసార వ్యాధిని నివారించడంలో, కాన్సర్‌, గర్భనిరోధక ఔషధంగా ఈ మొక్క ఉయోగపడుతుంది. అల్సర్స్‌కి, దెబ్బలకి, తామర, గజ్జి నివారణకి వాడే యునానీ మందుల తయారీలో దీనిని వాడతారు. గజ్జి తామర ఎక్కువగా బాధపడేవారు ఈ మొక్కను తీసుకొనివచ్చి మెత్తగా దంచుకొని ఒక ముద్దలా చేసుకుని ఉప్పుతో కలిపి గజ్జి తామర ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది.

పచ్చకామెర్ల వ్యాధికి తాజాగా తీసిన దీని వేరు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మ సంబంధ వ్యాధులకి దీని ఆకులు నూరి గాయాలకీ, దెబ్బలకీ, ఇతర చర్మం మీద ఏర్పడే మచ్చలకీ రాస్తే తక్షణ నివారణ ఉంటుంది. పాముకాటుకి విరుగుడుగా కూడా ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. పాముకాటు విరుగుడుకు ఈ మొక్కను మెత్తగా నూరి పాము కరిచిన ప్రదేశంలో ఉంచితే విషయము లోపలికి ఇవ్వకుండా చేస్తుంది తర్వాత వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.

చాలా మందికి నోరు, నాలుక, పెదవులు పగులుతాయి. దీంతో భోజనం చేయాలంటే, కారం తగిలితే నరకం కనిపిస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం నేల ఉసిరి ఆకుల్లో ఉంది. ఈ ఆకులను రోటిలో వేసి నూరి నీళ్లల్లో వేసి రాత్రి పూట మొత్తం అలాగే ఉంచాలి. తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించాలి. కొంతమందికి వెక్కిళ్ళు ఎక్కువగా రావడము ఆకలి వేయలేకపోవడమే వంటి సమస్యతో బాధపడే వారు నేల ఉసిరి ఆకు ఉదయము సాయంత్రము నమలడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

నేల ఉసిరి కాండం, వేర్లు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టునుండి ఏర్పడే పాలు అన్నీ ఆయుర్వేద మందుల్లో వాడతారు. చలువకి, దాహార్తిని తీర్చడానికి, బ్రాంకైటీస్‌కి, కుష్టువ్యాధికి, మూత్ర సంబంధ వ్యాధులకి, ఉబ్బసానికి, తయారు చేసే మందుల్లో నేలఉసిరిని ఎక్కువగా వాడతారు.

 

Exit mobile version