Home Health గ్రీన్ మెలన్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

గ్రీన్ మెలన్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

ప్రెగ్నన్సీ కన్ఫర్మ్ అయిన తరువాత మహిళల ఆహరం విషయంలో చాల మార్పులు వస్తాయి. ప్రెగ్నన్సీ మహిళలు తీసుకునే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారం మీదే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

health benefits of green melonగర్భవతులకు, కడుపులో పెరుగుతున్న శిశువులకు పోషకాలను అందించే వాటిలో గ్రీన్ మెలన్ ఒకటి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోడానికి కావలసిన శక్తి ఈ ఫ్రూట్ తింటే లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

గ్రీన్ మెలన్ లో కేలరీలు తక్కువ, అలాగే పోషకాలు ఎక్కువ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఎలెక్ట్రోలైట్ పొటాషియం కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్లూయిడ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది.

ఇందులో కేలరీస్ తక్కువగా ఉంటాయి. సోడియం కూడా తక్కువే. ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ ఎక్కువ. వీటి వల్ల ఆకలి తీరిన సంతృప్తి కలుగుతుంది. కాబట్టి వెయిట్ లాస్ కోసం ప్రయత్నించేవారు ఈ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది.

గ్రీన్ మెలన్ హై బీపీని తగ్గించేందుకు బాగా సహాయపడుతుంది. హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడేవారు తీసుకునే ఆహారంలో సోడియాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. వారికి ఈ ఫ్రూట్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. బ్రెయిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఫోలేట్ తో పాటు విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తాయి. ఇది గర్భిణీ మహిళలకు చాలా అవసరం.

ఇందులో లభించే పొటాషియం వల్ల ఇర్రెగులర్ హార్ట్ బీట్ సమస్య తలెత్తదు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి అవసరమయ్యే రెండు శక్తివంతమైన ఫైటోన్యూట్రియెంట్స్ గ్రీన్ మెలన్ లో పుష్కలంగా లభిస్తాయి.

Exit mobile version