Home Health కాసరకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాసరకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

కాకరకాయ ఈ పేరు వినగానే ముఖకవళికలు మారిపోతాయి. ఆ చేదు రుచికి మొకం చిట్లిస్తుంటారు. కానీ కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టే పెద్దలు బలవంతంగానైనా అవి తినిపిస్తారు. సాధారణంగా మనం చూసే కాకరకాయలు మాత్రమే కాదు ఈ కాకరకాయల్లో రకాలు కూడా ఉన్నాయి. ఆకాకర, కాసరకాయ లాంటివి కొన్ని ప్రాంతాల్లో సుపరిచితమే.

Health Benefits Of Kasarakayaకాసరకాయలు లేదా చిన్న కాకరగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లాలకు బాగా సుపరిచతమైన కాయగూర. ఈ మొక్క యొక్క శాస్త్రీయనామం మొమోర్డికా సింబలేరియా. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. భారతదేశం మరియు ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో ఉద్భవించింది. కాకరకాయ లానే ఇది కూడ చేదుగా వుంటుంది, కాని కాకర కాయ సంతతి కాదు.

వీటిని ప్రత్యేకించి పండించరు పొలాల్లో కలుపు లాగా పెరుగుతాయి. కానీ ఇప్పుడు వీటి ధర చికెన్ తో పోటీ గా ఉంటోంది. ఈ కాయలలో ఫైబర్, విటమిన్ సి, బీటా కెరోటిన్, కాల్షియం మరియు ఐరన్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది హెపాటోప్రొటెక్టివ్, యాంటీ డయారోహెల్, నెఫ్రోప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్, యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ అలెర్జీ యాక్టివిటీ వంటి ఔషధ లక్షణాలను కలిగి ఉంది.

చేదుగా ఉండే ఈ కాయలు కూర వండితే మాత్రం అద్బుతంగా ఉంటుంది. అదో రకపు చేదే గాని.. ఆ చేదు కూడ చాలా రుచిగా వుంటుంది. రాయల సీమ వాసులు చాలా ఇష్టంగా తినే కాయగూర ఇది. వీటిని రెండు విదాలుగా వంటలో వాడతారు. వెల్లుల్లితో తయారు చెసిన పప్పుల పొడితో వేపుడు చెసుకొంటారు. రాత్రిల్లు తినే జొన్న రొట్టెల్లో ఇదె వేపుడు కలుపుకొని తింటారు.

నీటిలో ఉప్పు వేసి ఉడకబెట్టి తర్వాత రెండు రోజుల దాకా బాగా ఎండలో ఎండబెట్టాక వాటిని ఒక డబ్బాలో నిలువ వుంచుతారు. ఎప్పుడు కావాలనుకొన్నప్పుడు అప్పుడు నూనెలో మజ్జిగ మిరపకాయలులాగ వేయించుకొని భోజనంలో తింటారు. ఇవి ఆరు నెలల నుండి సంవత్సరం దాక చెడిపోకుండా నిలువ వుంటాయి. ఇది కోలిక్, మలేరియా, డయాబెటిస్, ఇన్ఫెక్షన్లు, గాయాలు, పరాన్నజీవులు మరియునులి పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. ఈ ఆకుల రసం, పండ్ల గుజ్జు మరియు విత్తనాలు యాంటీ-హెలిమెటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. పురాతన కాలం నుండి, ఇది కడుపు నొప్పి మరియు నోటి పూతల వంటి వివిధ వ్యాధులను నయం చేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు.

కాసరకాయలు యొక్క భాగాలలో మిథనాల్ సారం ఉంటుంది, ఇది ఎరిలిచ్ అసిట్స్ కార్సినోమాకు వ్యతిరేకంగా ప్రామాణిక సైక్లోఫాస్ఫామైడ్‌తో పోలిస్తే యాంటీకాన్సర్ లక్షణాలను కలిగి ఉంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గిస్తుందని ప్రయోగపూర్వకంగా నిరూపించబడింది. కాసరకాయలోని కార్డియోప్రొటెక్టివ్ లక్షణాలు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Exit mobile version