Home Health కిస్ మిస్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కిస్ మిస్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

ఆరోగ్యానికి కావాల్సిన పోషకాహారం డ్రైఫ్రూట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. చూడటానికి అవి చిన్నగా ఉన్నా అందులోని ఖనిజ లవణాలు, విటమిన్లు శరీరానికి చాలా శక్తినిస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించడంతో డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. డ్రైఫ్రూట్స్‌లో ముఖ్యంగా కిస్‌మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కిస్‌మిస్(ఎండు ద్రాక్ష) బాగా తినడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టేయొచ్చని డాక్టర్లు చెబుతారు.

Health Benefits of kismisఇవి మనకు సంవత్సరమంతా లభిస్తాయి. అందువల్ల వీటిని మనం కావాలన్నా తినవచ్చు. వీటిని తింటే ఫ్యాట్, కొలెస్ట్రాల్ సమస్య కూడా ఉండదు. కిస్‌మిస్‌లో ఫైబర్ ఎక్కువ. ఇవి మలబద్ధకాన్ని నివారించి, తిన్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తాయి. పేగులు, పొట్టలో విష వ్యర్థాల్ని తరిమికొడతాయి.

కిస్‌మిస్ పండ్లను తరుచుగా తినడం వలన శరీరములో శక్తిగల ఆమ్లాలను సమన్వయం చేసి జ్వరం రానీయకుండా చేస్తుంది. కిస్‌మిస్ తినడం వలన నరాల నిస్సత్తువ, రక్తపోటు వంటి దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. అలాగే రక్తం శుభ్రపడటానికి నరాలకు బలం చేకూరటానికి కిస్‌మిస్ ఉపయోగపడుతుంది. గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. దీంతో ఉపశనం కలుగుతుంది.

కిస్‌మిస్ లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ నివారణ లో సహాయపడతాయి. చర్మకణాల్లోకి రాబోతున్న వైరస్‌ను ఆపేసి బయటకు పంపేస్తాయి. కాన్సర్ కణాల వృద్ధి, పుండ్ల పెరుగుదల వంటి వాటిని కూడా ఇవి అడ్డుకుంటాయి. కిస్‌మిస్‌లో విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలుంటాయి. అంతేకాదు ఐరన్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి పొట్టలో యాసిడ్ లెవెల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. అందువల్ల అసిడిటీ లాంటి సమస్యలు తగ్గుతాయి. కిస్‌మిస్‌లోని పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్ కళ్లను కాపాడి కంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

అయితే ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఎండు ద్రాక్షలో తీపి, కేలరీలు ఎక్కువ. ఇవి అతిగా తింటే బరువు పెరుగుతారు. అంతేకాదు కిస్ మిస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతిగా తింటే కడుపులో గడబెడ మొదలవుతుంది. పొట్ట ఉబ్బడం, గ్యాస్ వంటి రకరకాల సమస్యలొస్తాయి. కాబట్టి రోజూ 20కి మించకుండా తింటే సరిపోతుంది.

Exit mobile version