Home Health నిమ్మకాయ పచ్చడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

నిమ్మకాయ పచ్చడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిల్వ పచ్చళ్లంటే ప్రాణం. భోజనంలో తప్పకుండా అవకాయా లేదా మరేదైనా పచ్చడి ఉండాల్సిందే. ఈ పచ్చళ్లలో కూడా ఎన్నో తేడాలు ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశల్లో వేసుకోడానికి బెల్లం అవకాయా, లంచ్, డిన్నర్‌లో రకరకాల ఊరగాయలను ఆరగిస్తారు. అయితే, పెరుగులో నంజుకోడానికి మాత్రం నిమ్మకాయ పచ్చడికే ఎక్కువ మక్కువ చూపుతారు.

health benefits of lemon pickleమన అమ్మమ్మలు, నానమ్మలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలతోనే ఈ పచ్చళ్లు తయారు చేసేవారు. ఉప్పు, మసాలాలు.. చివరికి సూర్యరశ్మిని సైతం ఈ పచ్చళ్ల తయారీకి వాడేవారు. సీజనల్ ఫలాలైన మామిడి వంటి పండ్లను అన్ని సీజన్లలో తినేందుకు వీలుగా పచ్చళ్లు తయారు చేసేవారు. ఆ పచ్చళ్లల్లో అన్నిరకాల పోషకాలు ఉండేలా చూసుకొనేవారు. ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు వీలుగా అప్పట్లో సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించేవారు. ఈ పచ్చళ్లల్లో విటమిన్-ఎ, విటమిన్-కె, ప్రోబయోటిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. మరి ఈ పచ్చళ్లల్లో ఎక్కువ హెల్తీ అయిన నిమ్మకాయ పచ్చడి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది:

స‌ప్లిమెంట్ల ద్వారా విట‌మిన్లు, పోష‌కాల‌ను తీసుకోవ‌డానికి బ‌దులు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం ద్వారా వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌చ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మ‌కాయ పచ్చడి ఒక‌టి. ఇందులో బీ కాంప్లెక్స్ విట‌మిన్లు పుష్క‌లంగా ఉంటాయి.

ర‌క్త‌పోటుని నియంత్రిస్తుంది:

ఆరోగ్యంగా ఉండాలంటే శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా ఉండాలి. ర‌క్త ప్ర‌వాహంలో హెచ్చు త‌గ్గులు ర‌క్త‌పోటుకు కార‌ణ‌మ‌వుతుంది. అయితే రోజూ నిమ్మ‌కాయ పచ్చడితో తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వు‌తుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది:

నిమ్మ‌కాయ పచ్చడిలో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. పైగా కొవ్వు అస‌లు ఉండ‌దు. హృద్రోగాలు వ‌చ్చే ప్ర‌మాదం త‌క్కువ ఉంటుంది. కాబ‌ట్టి దీన్ని నిర‌భ్యంతరంగా డైట్‌లో చేర్చుకోవ‌చ్చు.

జీర్ణ క్రియ మెరుగుపరుస్తుంది:

నిమ్మ‌కాయ పచ్చడి తిన‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. నిమ్మ‌లో ఉండే ఎంజైములు శ‌రీరంలోని విష‌తుల్యాల‌ను తొల‌గించడంలో స‌హ‌క‌రిస్తాయి. దీనివ‌ల్ల బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

ఎముక‌లు బ‌లంగా ఉంటాయి:

నిమ్మ‌కాయ‌లో కాప‌ర్‌, పొటాషియం, ఐర‌న్‌, కాల్షియం ఉంటాయి. వ‌య‌సు పెరిగే కొద్ది ఎముక‌ల ఆరోగ్యం క్షీణించ‌డం మొద‌ల‌వుతుంది. కాబ‌ట్టి కాల్షియం, విట‌మిన్ ఏ, సీ, పొటాషియం క‌లిగిన నిమ్మ‌కాయ తొక్కును ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా ఎముక‌ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌చ్చు.

 

Exit mobile version