Home Health మరమరాలు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

మరమరాలు వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినే స్నాక్స్ లో మరమరాలు ఒకటి. వీటిని బొరుగులనీ, ముర్ముర్లు, మురీలు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇవి ప్రాచుర్యం పొందాయి. అలాగే పొరుగు దేశాలైనా బంగ్లాదేశ్, పాకిస్థాన్లోనూ ప్రసిద్ధి చెందాయి. వీటిని బియ్యం తో తయారు చేస్తారు.. అందుకే కొన్ని ప్రాంతాల్లో మరమరాలను పఫుడ్ రైస్ అని అంటారు. బియ్యం కు అధిక పీడనాన్ని అందించితే ఇవి తయారు అవుతాయి.
Health Benefits Of Maramaralu
మరమరాలు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా వరిని ఉడకబెట్టి దాంట్లో నుండి నీరు వంచి వెయ్యాలి. తరువాత బాగా ఎండబెట్టి పొట్టు తీసివెయ్యాలి. ఒక గిన్నెలో ఇసుక వేసి అది కాలిన తరువాత ఈ దంచిన బియ్యాన్ని వేసి త్వర త్వరగా వేయించాలి. ఆ తరువాత జల్లెడ పట్టి ఇసుకని తీసివేస్తే మరమరాలు తయారైనట్టే. అస్తమానం నూనెలో వేగినవి కాకుండా పిల్లలకి ఇలాంటివి తినిపించారంటే బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది.
అయితే వాటితో ఆకలితీరదని వారిస్తారు కొందరు. నిజానికి వరి అన్నంతో సరిసమానంగా అన్నీ పోషకవిలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునె వారికి మంచి ఇది స్నాక్. కేవలం స్నాక్స్ మాత్రమే కాదు మరమరాలతో ఎన్నో రకాల స్వీట్స్, పాయసం, టిఫిన్స్ చేసుకోవచ్చు.. అయితే ఇవి తినేవరకు తేలిగ్గానే ఉంటుంది.. కానీ పొట్ట నిండుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు.
మరమరాలు చాలా తేలినకైన ఆహారం. చాలా తక్కువ కేలరీలు కలిగి ఉంటాయి. పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి మీకు సహాయపడుతాయి. నిల్వ కొవ్వులను కూడా ఈ మరమరాలు ఇట్టే కరిగిస్తాయి అని అంటున్నారు. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుంది. రోజూ మంచి మొత్తంలో ఫైబర్ తీసుకోవడం వల్ల మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంతో మరమరాలతో తయారయిన ఆహారపదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి.
వీటిల్లో విటమిన్‌ – డి, విటమిన్‌ – బి లతో పాటు క్యాల్షియం, ఐరన్‌ శాతం కూడా ఎక్కువే. ఈ పోషకాలన్నీ బలమైన ఎముకలు, దంతాలు ఉండేలా చూసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎముకలు విరిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది. పిల్లల ఎదుగుదలలో మరమరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.
అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు తరచూ వీటిని తీసుకోవడం వల్ల అవి దూరమవుతాయి. ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్థులకు మరమరాలు మంచివి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. అందుకని కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది.
పది నుంచి 18 ఏళ్ళ లోపు మగ పిల్లల్లో జీవ క్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది. సరిగా తినకపోతే బరువు పెరగడం, తగ్గడం, నీరసం, విటమిన్ల లోపం వంటి సమస్యలు వస్తాయి. వీరికి ప్రోటీన్ ఆహారం అనేది చాలా అవసరం. వీరికి ప్రతీ రోజు సరైన ఆహారం అనేది అవసరం. పండ్లు, మొలకెత్తిన గింజలు, బఠాణీలు, సెనగలు, మరమరాలు, పేలాలు, ఇంట్లో చేసిన రొట్టెలను స్నాక్స్‌గా ఇస్తే మెదడు చురుగ్గా ఉండడానికి సహకరిస్తాయి. మరమరాల్లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ వల్ల రోగనిరోధక శక్తి ఇనుమడింపచేస్తుంది.

Exit mobile version