Home Health వేపపొడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

వేపపొడి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

0

వేప పుల్లతో దంతధావన చేయడం భారతీయుల జీవన విధానంలో ఒక భాగం. శరీరం పైన ఎక్కడైనా దురదలు వస్తే వేపాకు వేసి కాచిన నీటితో స్నానం చేస్తారు. వేపతో దంతధావనం చేయడం వల్ల నోట్లో శ్లేష్మదోషం తగ్గి నాలుకకు రుచి తెలుస్తుంది. శరీరంలోకి ప్రవేశించిన వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి. వేప ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు, గింజలు, వేర్లు, వేప బంక తదితర వేప ఉత్పత్తులన్నీ ఔషధగుణాలతో నిండి వుంటాయి.

health benefits of neem powderవేప బెరడు పొడిని రెండు చెంచాలు ఉదయం, రాత్రి గోరు వెచ్చని నీటితో సేవిస్తే మలేరియా తగ్గుతుంది. ఆకలి మందగించినపుడు, కాలేయ వ్యాధులు ఉన్నప్పుడు, వేప చెట్టు బెరడు 60 గ్రా|| తీసుకుని 4 గ్లాసుల నీళ్ళలో కలిపి ఉడికించి కషాయంగా చేసుకోవాలి. ఈ నీళ్లు బాగా మారగ కాచాలి. అంటే 3 గ్లాసుల నీళ్లు ఇంకిపోవాలి. ఇప్పుడు దీనిని 4 భాగాలుగా విభజించి 4 రోజులుగా రోజుకు రెండు సార్లు ఇవ్వాలి. ఇలా తాగుతే ఆకలి పుడుతుంది కాలేయ వ్యాధులు మటు మాయం అవుతాయి.

వివిధ అధ్యయనాల ప్రకారం, కడుపు మరియు పేగు పూతల నివారణకు వేప బెరడు సారం కనుగొనబడింది. బెరడు సారాన్ని 10 వారాలపాటు ప్రతిరోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల ఆచరణాత్మకంగా పూతలు నయం అవుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.

లేత వేప బెరడు, ఆకుల తో నూరి గాయాలపై పూత గా వాడుకోవచ్చు.

వేప బెరడు మలేరియా మరియు అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి కూడా సహాయపడుతుంది.

వేప బెరడు ని కాల్చి మసి చేసి సీసాలో ఉంచి భద్రపరచుకోవాలి. పుండు మీద ఆ మసి చల్లితే పుండ్లు మానుతాయి.

వేప చెట్టు బెరడు చర్మ రోగ నివారిణి గా పనిచేస్తుంది. వేప బెరడు కషాయం లా కాచి, చల్లార్చి ఉదయం సాయంత్రం (రెండు పూటలా) సేవిస్తే చర్మ వ్యాధులు నివారణ అవుతాయి.

ప్రేగుల్లో క్రిములుంటే, వేప చెట్టు బెరడు (పట్టా) మెత్తని చూర్ణం చేసి ఉదయం సాయంత్రం ఒక్క చెంచా చొప్పున వారం రోజులు తీసుకోవాలి.

రక్తశుద్ధి జరగాలంటే వేప చెక్కపొడి, బావంచాల పొడి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజూ ఒకసారి రెండు గ్రాముల పొడిని ఒక టీ స్పూన్ తేనె లేదా 50 మి.లీ నీటిలో కలిపి సేవించడం వల్ల ఫలితం వుంటుంది.

వేపబెరడు పొడి 10 గ్రా. శొంఠి 10 గ్రా, తులసి ఆకులు తీసుకుని కలిపి మెత్తగా నూరుకోవాలి. దీని మీద నల్ల మిరియాల పొడి కొంచెం చెల్లి తిరిగి ” నూరుకోవాలి. దీన్ని ఉదయం, సాయంత్రం సేవిస్తూంటే కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

 

Exit mobile version