బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని, తెలివితేటలూ పెరుగుతాయని పెద్దలు అంటుంటారు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నా బెండకాయ విటమిన్లు, ఖనిజాలు, పీచు మాత్రం పుష్కలంగా దొరుకుతాయని పోషక నిపుణులు పేర్కొంటున్నారు. బెండకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వీటిల్లో దొరికే లెక్టిన్ అనే ప్రొటీన్ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతేకాదు బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. బెండకాయలో జిగురు ఉండటం వల్ల విరివిగా అన్ని వంటలలో వీటిని వాడటం కుదరకపోయినా బెండకాయను చాలా ఎక్కువగా వంటలలో వాడతారు. బెండకాయలతో వేపుడు చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, వరుగులు కూడా చేసుకోవచ్చు. బెండకాయల్ని ఎలా తిన్నా వాటిలో పోషకాలు కొంతవరకూ మనకు అందుతాయి. అయితే పూర్తిగా పోషకాలు అందాలంటే చిన్న చిట్కా పాటించాలి. బాడీలో హీట్ ఎక్కువైనప్పుడు చల్లబరిచేందుకు బెండకాయ నీరు ఉపయోగపడుతుంది.
దానికోసం చిన్న బెండకాయలు రెండు లేదా మూడు తీసుకుని, బాగా కడిగి, వాటి మొదలు, చివరల్ని తీసేయాలి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని నీటిలో ఉంచితే అవి బాగా నాని వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఉదయాన్నే నీటిలోని బెండ ముక్కల్ని తీసేసి నీటిని తాగాలి. అప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి.
అధిక బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ నీరు మేలు చేస్తుంది. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టే శక్తి దీనికి ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఈ బెండకాయ వాటర్ మన పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. ACDT, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. బెండకాయల్లో ఫైబర్ ఎక్కువ. అది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
గుండె పదిలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బెండకాయల్ని నానబెట్టిన నీరు ఎంతో మేలు చేస్తుంది.
బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.