Home Health ఉల్లి టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఉల్లి టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

చలికాలం వచ్చిందంటే చాలు వాతావరణంలో మార్పులతోపాటు జలుబు,దగ్గును కూడా వెంటబెట్టుకొస్తుంది. ఈ సీజన్ లో జలుబు, దగ్గు చేసిందంటే ఓ పట్టాన వదలదు. అందుకే ఎప్పటికప్పుడు శరీరాన్ని వేడిగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి. చల్లగా ఉండేవి అస్సలు తీసుకోవద్దు. ముఖ్యంగా డ్రింకులు, ఐస్ క్రీములు, చాక్లెట్లని వీలైనంత దూరంగా పెట్టాలి.

Onion Teaఇక చలికాలం వచ్చిందంటే లేవగానే వేడి వేడిగా ఒక టీ గాని కాఫీ గాని తాగాలి అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ అది కూడా రోజుకి ఓసారి మాత్రమే అంటున్నారు వైద్యులు. దానికి బదులు సూప్ లాంటివి ఈ సీజన్ లో తీసుకుంటే మంచిది. ఇక ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములు తగ్గించుకోడానికి ఉల్లిపాయ టీ మంచి పరిష్కారంగా చెప్పొచ్చు.

జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం ఇలాంటివి ఉంటే ఉల్లి టీ అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సీ అందిస్తుంది. రెండు రోజుల్లో జలుబు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. మరి ఈ ఉల్లిపాయ టీని ఎలా తయారుచేసుకోవాలి తెలుసుకుందాం…

ముందుగా ఒక గ్లాసు నీరు మరిగించి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు స్పూన్ సోంపు గింజలను వేసి అన్నీ కలిపి నీటిలో బాగా మరిగించాలి. ఇలా 20 నిమిషాలు మరిగించి కషాయంగా వచ్చాక దాన్ని వడగట్టి ఆ ఉల్లి పొరలు తీసేసి ఆ టీని తాగితే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.

 

Exit mobile version