Home Health మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఊలాంగ్ టీ గురించి తెలుసా

మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఊలాంగ్ టీ గురించి తెలుసా

0

కాలుష్యంతో నిండిపోయిన వాతావరణం నుండి మనల్ని మనం రక్షించుకోడానికి ఎన్నో రకాల ఆవిష్కరణలు నిత్యం వస్తూనే ఉన్నాయి. అందులో చాలా వరకు పురాతన కాలంలో ఉపయోగించినవే అయినా వాటిని గుర్తించడంలో విఫలమయ్యాం. అలాంటి ఒక ఆరోగ్య ప్రదాయినే ఊలాంగ్ టీ.

Health Benefits of oolong teaప్రాసెస్‌ చేయబడిన గ్రీన్‌, బ్లాక్‌ టీ ల మిశ్రమాన్ని ఊలాంగ్‌ టీ అంటారు. చైనా, తైవాన్‌లలో పురాతన కాలం నుంచి ప్రజలు ఊలాంగ్‌ టీని సేవిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కూడా ఈ టీ లభిస్తోంది. ఇందులో జాస్మిన్‌, కొబ్బరి, క్యారమెల్‌ వంటి ఇతర ఫ్లేవర్స్‌ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతర టీల కన్నా ఊలాంగ్‌ టీని తాగితే మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

ఊలాంగ్ టీని తాగడం వలన శరీరం మనం తినే ఆహారంలో ఉండే కొవ్వును శోషించుకోవడం మానేస్తుంది. దాంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. తరచు డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారు నిత్యం ఊలాంగ్ టీ తాగితే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

ఊలాంగ్‌ టీలో ఇతర టీలలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఊలాంగ్‌ టీలో విటమిన్‌ ఎ, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, విటమిన్‌ సి, ఇ, కెలతోపాటు ఫోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం, మాంగనీస్‌, కాపర్‌, సెలినియం, పొటాషియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను ఇస్తాయి.

శరీరంలో చెడుకొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే ఫలితం ఉంటుంది. ఊలాంగ్ టీ తాగడం వలన అధిక బరవు త్వరగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊలాంగ్ టీ తాగితే మన శరీరంలో కొవ్వు కరిగే రేటు 12 శాతం వరకు పెరుగుతుందట. దీంతో కొవ్వు త్వరగా కరిగి బరువు వేగంగా తగ్గుతారని వారు చెప్తున్నారు. కనుక ఊలాంగ్‌ని నిత్యం తాగితే అధిక బరువును ఇట్టే తగ్గించుకోవచ్చును. ఇక నిత్యం ఒత్తిడి, ఆందోళన ఎదుర్కునే వారు ఊలాంగ్ టీ తాగితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

Exit mobile version