Home Health పాలకూరతో ఆరోగ్యానికి జరిగే మేలు ఏంటో తెలుసా ?

పాలకూరతో ఆరోగ్యానికి జరిగే మేలు ఏంటో తెలుసా ?

0

హెల్దీ డైట్ అంటే తాజా కూరగాయలు, ఆకుకూరలు. ఆకుకూరల్లో మేలైనది పాలకూర. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇందులో వుండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ శరీరానికి మేలు చేస్తాయి. మెదడు చురుగ్గా అయ్యేలా చేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కాన్సర్‌తో పోరాడుతుంది. ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. ఇలా పాలకూరతో ఇంకెన్ని ఉపయోగాలు ఉన్నాయో చూదాం.

Health Benefits of palakuraపాలకూరలోని పొటాషియం… కండరాలను బలపరుస్తుంది. పాలకూరలోని విటమిన్ కె జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, జ్వరం, పిత్త, వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది.

పాలకూరలో ఉండే విటమిన్ ఎ మన కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాలు, ఇతర కంటి సమస్యలను రాకుండా చూస్తుంది.

మన శరీరంలో తగినంత విటమిన్ కె లేకపోతే గాయాలు అయినప్పుడు పెద్ద ఎత్తున రక్తస్రావం అవుతుంది. దాన్ని ఆపాలంటే మన శరీరంలో విటమిన్ కె ఉండాలి. పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తాన్ని త్వరగా గడ్డ కట్టేందుకు దోహదపడుతుంది.

పాలకూరలో లభించే విటమిన్‌ C, Aలు మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారించటంలో తోడ్పడతాయి. ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. తరుచుగా పాలకూర ఆహారంలో తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయలు దూరం అవుతాయి.

 

Exit mobile version