Home Health బొప్పాయి పండులోనే కాదు ఆకులతో అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు

బొప్పాయి పండులోనే కాదు ఆకులతో అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు

0

బొప్పాయి పండు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. కేవలం బొప్పాయి పండే కాదు ఒక బొప్పాయి మొక్క మన పెరట్లో ఉందంటే… మన దగ్గర ఓ పేద్ద ఔషధ బాటిల్ ఉన్నట్లే. ఎందుకంటే బొప్పాయి ఆకుల నిండా ఔషధ గుణాలే. అందుకే ఆయుర్వేద మందుల్లో దాన్ని వాడుతారు. బొప్పాయి గింజలు కూడా అనేక రకాలుగా ఉపయోగ పడతాయి. బొప్పాయి ఆకులు తినడానికి చేదుగా ఉన్నా ప్రయోజనాలు మాత్రం మెండుగా ఉన్నాయి . వివిధ రకాల అనారోగ్య సమస్యలను నివారించే న్యూట్రీషియన్స్ బొప్పాయి ఆకులలో అద్భుతంగా ఉన్నాయి. బొప్పాయి ఆకుల్లోవిటమిన్ ఎ, బి, సి, డి మరియు ఇ, క్యాల్షియంలు పుష్కలంగా ఉన్నాయి. యోగాలో కూడా బొప్పాయి ఆకులకు ప్రాధాన్యం ఉంది. మలేరియా నుండి కాన్సర్ వరకూ ఎన్నో రోగాల్ని బొప్పాయి ఆకులు నయం చెయ్యగలవు.

health benefits of papaya leavesచుండ్రు, జుట్టు రాలిపోవడం, జుట్టులో దురద ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా… బొప్పాయి ఆకుల రసం రాసుకోవచ్చు. జుట్టు తెల్లబడటం, సన్నగా అయిపోవడం వంటి సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది షాంపూ కండీషనర్‌లా పనిచేసి జుట్టును మెరిపిస్తుంది కూడా… బొప్పాయి ఆకుల రసం… మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి బొప్పాయి ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలు తేల్చాయి.

మలేరియా వ్యాధికి సరైన పరిష్కారం బొప్పాయి ఆకుల్లో లభిస్తోంది. బొప్పాయి ఆకుల రసంతో మలేరియాకి చెక్ పెట్టేయొచ్చు. అంతేనా… డేంగ్యును నివారించడంలోనూ బొప్పాయి ఆకులు కీలకంగా పని చేస్తాయి. బొప్పాయి ఆకుల రసాన్నిత్రాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డేంగ్యూను నివారించుకోవచ్చు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఎంజైమ్స్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది. బ్లడ్ క్లాట్ కాకుండా నివారిస్తుంది మరియు డేంగ్యు వైరస్ వల్ల లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

ఇక ఎముకలను ధృడంగా చేయడంలోనూ బొప్పాయి ఆకులను మంచి ఔషధంగా చెప్పొచ్చు. ఎముకలు దృఢంగా ఉండడానికి కాల్షియం, విటమిన్‌ సి, విటమిన్‌ కె అవసరమవుతాయి. వాటితో పాటు ఎముకలను బలోపేతం చేసే విటమిన్ డి కూడా ఈ ఆకుల్లో పుష్కలంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

చర్మవ్యాధులను నివారించే గుణం బొప్పాయిలో ఉంది. బొప్పాయి ఆకుల రసాన్ని చర్మంపై రాసుకుంటే… చర్మ అలర్జీలు, దురదల వంటివి పోతాయి. చర్మం మెరుస్తుంది కూడా. బొప్పాయి ఆకులు ఎండబెట్టి పొడి చేసుకొని దీనికి కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి మొటిమలున్న చోట రాయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేస్తే.. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

 

Exit mobile version