Home Health పీనట్ బటర్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

పీనట్ బటర్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య అధిక బరువు. మన ఆహారం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక శరీర బరువును నియంత్రించుకోవడం వల్ల ఆయా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పీనట్‌ బటర్‌ను చేర్చడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గుతుంది.

పీనట్ బటర్పీనట్ బటర్ కేవలం రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. దీనిలో పోషకవిలువలు అనేకం. ఇది కేవలం స్కూల్ లంచెస్ కి మాత్రమే పరిమితమైనది కాదు, దీనిని స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. అదే సమయంలో, స్మూతీస్ తో కలిపి ప్రోటీన్ షేక్ గా కూడా తీసుకోవచ్చు. మృదువైన పీనట్ బటర్ అనేది ఫ్రూట్స్ నుంచి చాకోలెట్స్ వరకు అన్నిటికి జోడీగా సరిపోతుంది. మోనో అన్సాట్యురేటెడ్ ఫ్యాట్స్ తో పాటు పోషకవిలువలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందువలనే, అధిక బరువును తగ్గాలనుకునే వారికిది ఇష్టమైన ఆహారపదార్థం.

పీనట్‌ బటర్‌ ను తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. దీని వల్ల శరీరానికి నిరంతర శక్తి అందుతుంది. 2017లో ఓ సర్వేలో భాగంగా దాదాపు 73 శాతం మంది భారతీయులకు ప్రోటీన్ల లోపం ఉన్నట్లు వెల్లడయింది. ప్రోటీన్ల లోపం ఉన్నవారు ప్రతి రోజూ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పీనట్‌ బటర్‌ను తీసుకోవడం వల్ల వారి శరీరానికి కావలసినన్ని ప్రోటీన్లు అందుతాయి.

పీనట్ బటర్ లో అధిక ప్రోటీన్లు అలాగే ఆరోగ్యకరమైన నూనెలు లభ్యమవుతాయి. ఇవి డయాబెటీస్ ని అలాగే అల్జీమర్ వ్యాధిని నిరోధించేందుకు ఉపయోగపడతాయి. పీనట్ బటర్ ని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. పీనట్ బటర్ అనేది కొవ్వు రూపంలో శరీరంలో పేరుకోబడదు. రెండు టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ నుంచి188 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 6 గ్రాముల కార్బోహైడ్రేట్స్ తో పాటు 16 గ్రాముల కొవ్వు లభిస్తుంది. పీనట్స్ కి మీరు అలర్జిక్ కాకపోతే ప్రతి రోజు శాండ్విచ్ పైన అలాగే టోస్ట్ పైన దీనిని స్ప్రెడ్ చేసి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

100 గ్రాముల పీనట్ బటర్ నుంచి అధిక మోతాదులో ప్రోటీన్ అనేది లభ్యమవుతుంది. అంటే దాదాపు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ అనేది లభ్యమవుతుంది. మన శరీరానికి ప్రోటీన్ అనేది అత్యంత అవసరం. మనం తినే ఆహారం అమినో యాసిడ్స్ గా మారుతుంది. ఆ తరువాత అవి శరీరంలోని ప్రతి సెల్ మరమత్తుకి అలాగే కొత్త సెల్స్ నిర్మాణానికి ఉపయోగపడతాయి.

పీనట్ బటర్ లో లభించే ఫ్యాట్ కంటెంట్ అనేది ఆలివ్ ఆయిల్ లో లభించే ఫ్యాట్స్ తో సమానంగా లభిస్తాయి. ఇందులో మోనో అన్ సాట్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. మీ గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వీటిని తీసుకోవచ్చు. పీనట్ బటర్ లో లభించే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ అనేవి శరీరంలోని చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంపొందిస్తాయి.

పీనట్ బటర్ లో విటమిన్లు అధిక సంఖ్యలో లభ్యమవుతాయి. ఇవి శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లు. ఇందులో లభించే విటమిన్ ఏ వలన కంటిచూపు మెరుగవుతుంది. విటమిన్ సి వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే చిన్నపాటి అల్సర్లు వేగంగా నయమవుతాయి. అలాగే, విటమిన్ ఈ అనేది శరీరానికి అవసరమయ్యే మైక్రో న్యూట్రియెంట్. దీని వలన ఆర్టెరీస్ లోని కాంప్లెక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి త్వరగా కరిగిపోతాయి.

పీనట్ బటర్లో రిస్వెరాట్రోల్ అనే ఒక రకమైన బయోకెమికల్ ఉంటుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని శక్తివంతం చేయడానికి తోడ్పడుతుంది. పీనట్ బటర్ వల్ల చిన్నారుల్లో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను అరికట్టవచ్చు. పీనట్ బటర్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పీనట్ బటర్లో జింక్, సోడియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫొలేట్, నియాసిస్, థియామిన్, విటమిన్ బి6, రిబోఫ్లావిన్లు లభిస్తాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.

పీనట్‌ బటర్‌ను శాండ్ విచ్ లేదా రొట్టెలలో కలిపి తీసుకోవచ్చు. అయితే పీనట్‌ బటర్‌ను అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతారు. వీటిలో అధిక మొత్తం కేలరీలు ఉండటం వల్ల శరీర బరువు పెరగడానికి దోహదపడుతుంది. కనుక బరువు పెరగాలనుకునేవారు దీన్ని ఎక్కువగా తినాలి. అదే తగ్గాలనుకునేవారు దీన్ని తక్కువ పరిమాణంలో ప్రతి రోజూ తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడమే కాకుండా బరువును కూడా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.

శరీర బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు పీనట్‌ బటర్‌ను స్వల్ప మోతాదులో తీసుకోవటం వల్ల మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకొనే వారికి పీనట్‌ బటర్‌ ఒక మంచి ఆహార పదార్థంగా ఉపయోగపడుతుంది.

 

Exit mobile version