Home Health పైనాపిల్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

పైనాపిల్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

0

పైనాపిల్ లో ఎన్నో పోషకాలు, ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మన శరీరానికి అవసరమైనవే. అసలు ఈ అనాస పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Pineappleరోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది:

పైనాపిల్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మన శరీరానికి రోజుకి అవసరమైన విటమిన్ సి లో సగభాగం పైనాపిల్లో ఉంటుంది. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

బరువు తగ్గిస్తుంది:

ఒబేసిటీతో బాధపడేవారు పైనాపిల్ తినడం ద్వారా అధిక బరువు తగ్గించుకోవచ్చు. పైనాపిల్ మన శరీరంలో కొవ్వులను ఫ్యాటీ యాసిడ్స్ గా మారుస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని ప్రయత్నించేవారు సైతం పైనాపిల్ ను ఆహారంగా తీసుకోవచ్చు.

జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

పైనాపిల్ లో బ్రొమెలీన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే పైనాపిల్లో ఉండే పీచుపదార్థం, విటమిన్ సి కూడా జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడిని తగ్గించడంలో విటమిన్ బి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మీ మూడ్ ను ఉత్సాహంగా మార్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. పైనాపిల్లో విటమిన్ సితో పాటు బీ విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి రోజూ పైనాపిల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

కంటి చూపు బాగుపడుతుంది:

వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పైనాపిల్ ను మీ డైట్లో చేర్చుకోవాల్సిందే. పైనాపిల్లో ఉండే బీటాకెరోటిన్, విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపు మందగించకుండా కాపాడతాయి.

రక్తపోటు అదుపులో ఉంటుంది:

పైనాపిల్ లో ఉండే పొటాషియం.. రక్తనాళాలపై ఒత్తిడిని తగ్గించి రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది.

మొటిమలు తగ్గిస్తుంది:

చర్మంపై మొటిమలు రావడానికి ఫ్రీ రాడికల్స్ కూడా కారణమే. పైనాపిల్ తినడం ద్వారా దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. కాబట్టి మొటిమలు రాకుండా ఉంటాయి. పైనాపిల్ లో ఉన్న బ్రొమెలీన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి మొటిమలను తగ్గిస్తుంది.

మృత కణాలు తొలగిస్తుంది:

చర్మంపై చేరిన మృతకణాలను పైనాపిల్ తో సులభంగా తొలగించుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు తొక్క తీసిన పైనాపిల్ ముక్కతో శరీరాన్ని రుద్దుకుంటే డెడ్ స్కిన్ సెల్ప్ పోతాయి.

చర్మం ముడతలు పడకుండా చేస్తుంది:

వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలు నియంత్రించడానికి పైనాపిల్ తింటే సరి. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది చర్మాన్ని సాగిపోకుండా చేస్తుంది.

 

Exit mobile version