“మద్యపానం ఆరోగ్యానికి హానికరం” ఇది అందరికి తెలిసిన మాటే. అతిగా తాగడం మంచిది కాదు లివర్ పాడైపోతుందని పెద్దలు, వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ ఇప్పుడు దీని గురించి మరో కొత్త విషయం తేలింది. అదేంటంటే… రోజూ కాసింత వైన్ తాగితే అందంగా తయారవుతారట. వృద్ధాప్యం కూడా త్వరగా ధరిచేరదట.
ముఖ్యంగా ఆల్కహాల్ బెవరేజెస్ లో రెడ్ వైన్ సేవించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగచేస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందిండచంలో రెడ్ వైన్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరి రెడ్ వైన్ లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
- రెడ్‌వైన్‌లోని ప్రత్యేక గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే వృద్ధ్యాప్య ఛాయలను దూరం చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
- రెడ్ వైన్ తాగటం వల్ల చెడు కొలస్ట్రాల్ తగ్గించి మంచి కొలస్ట్రాల్ పెంచుతుంది. దీంతో గుండెకు సంబంధించిన వ్యాధుల దారిచేరకుండా సహాయపడుతుంది.
- ముఖానికి ప్రతి రోజు రెడ్ వైన్ మసాజ్ చేయడం వల్ల మెరిసేటి క్లియర్ స్కిన్ సహజంగా పొందడానికి ఉపయోగపడుతుంది.
- రెడ్ వైన్ తాగడం వల్ల అందంగా ఉండడంతో పాటు ఎలాంటి చర్మ సంబధిత వ్యాధుల బారినపడకుండా చూస్తుంది. అలాగే సూర్యరశ్మి కారణంగా కలిగే చర్మ వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
- రెడ్ వైన్ ను రాత్రి తాగడం వల్ల నాడీవ్యవస్థకు విశ్రాంతి సహాయపడి స్ట్రెస్ తగ్గిస్తుంది. దాంతో సుఖవంతమైన నిద్ర పొందవచ్చు.
- మతిమరుపు, దంత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ నుండి రక్షణ పొందడానికి రెడ్ వైన్ బాగా ఉపయోగపడుతుంది.
- రెడ్ వైన్ జలుబు, ఫ్ల్యూ వంటి జబ్బుల నుండి కాపాడడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.
- డయాబెటీస్ వారికి ఈ వైన్ అమృతం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంత ఫుడ్ డైట్ చేసిన ఎన్ని ఔషదాలు వాడినా ఈ డయాబెటీస్ కంట్రోల్ అవ్వడం లేదు. అలాంటి డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి వైన్ చాలా మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.