డైట్ ఫాలో అయ్యేవారు రైస్ కి బదులు రోటి, చపాతీ లాంటివి తింటూ ఉంటారు. ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకుంటున్నారు. రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరుగుతోంది, అందుకే చాలా మంది తక్కువ కొలెస్ట్రాల్ వచ్చేలా ఫుడ్ తీసుకుంటున్నారు. ఇదివరకు కొన్ని ప్రాంతాల్లోనే తినే జొన్నరొట్టె ఇప్పుడు అందరూ తింటున్నారు. జొన్నలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.