Home Health పుదీనాతో ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు

పుదీనాతో ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు

0
Health Benefits of Spearmint

ఆకుకూరల్లో ఘుమఘుమలాడే పుదీన పూర్తి ఔషధ గుణాలు కలిగివున్న మొక్క. దీని ఆకులు సంవత్సరం పొడవునా ఆకుపచ్చగా ఉంటాయి. పుదీనా మొక్క ప్రతి భాగం ఉపయోగపడేదే.. ఔషధతత్వాలు కలిగిఉన్నదే..!పుదీనాలో ఉండే ఔషధ గుణాలు అలర్జీని, ఉబ్బసాన్ని దూరంచేస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అందుకే వంటల్లో పుదీనాను వాడుతూ ఉండాలని చెబుతున్నారు. తరచూ కూర లేదా పచ్చళ్ల రూపంలో పుదీనా ఆకులను తీసుకుంటే ఫలితం కనిపిస్తుందట. ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, ఫేస్ క్రీమ్స్ లో, ఆఖరికి సిగరెట్ తయారీలో కూడా ఈ మధ్య పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇలా పుదీనా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..!

వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేస్తుంది.

వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు.

పుదీనాలో ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు.. కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.

చర్మం దురదగా ఉన్నప్పుడు ఈ పుదీనా ఆకులను నలిపి ఆ ప్రాంతాల్లో రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.

పుదీనా ఆకులతో కాచిన కషాయంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని నోటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.చూయింగ్ గమ్ తినేబదులు… మౌత్ ఫ్రెష్‌నర్‌గా పుదీనా ఆకులు తినడం బెటర్.

పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.

వామ్టింగ్, వికారంగా అనిపిస్తున్నప్పుడు.ఒకట్రెండు పుదీనా ఆకుల్ని తీసుకొని ముద్దలా చేసి కొద్దిగా పంచదార లేదా యోగర్ట్ కలిపి తింటే ఫలితం కనిపిస్తుంది.

దగ్గు అదేపనిగా వస్తుంటే… పుదీనా ఆకుల రసం, బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకుంటే… దగ్గు తగ్గుతుంది.

ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది.

పుదీనా ఆకుల వాసన మెదడును ఉత్తేజితం చేసి ఒత్తిళ్లతో అలసిపోయిన మెదడుకు శక్తిదాయకంగా పనిచేస్తుందని, ఏకాగ్రతను పెంచడం ద్వారా స్పష్టమైన ఆలోచనలకు మూలమవుతుందని నిపుణులు అంటున్నారు. పుదీనా వాసన పీల్చడం ద్వారా తలనొప్పులు తగ్గుతాయని, పూడుకుపోయిన సైనస్‌ గదులు శుభ్రమవుతాయని అంటున్నారు. మైగ్రేన్‌ సమస్య కూడా తగ్గిపోతుంది. మంచి నిద్ర పడుతుందని అంటున్నారు.

Exit mobile version