Home Health టెఫ్ పిండి అంటే ఏమిటి, మరియు దాని ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

టెఫ్ పిండి అంటే ఏమిటి, మరియు దాని ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0

టెఫ్ అనేది ఇప్పుడిప్పుడే ఇండియాలో ప్రాచుర్యం పొందే ఫుడ్. మొక్కల నుంచి వచ్చే ఈ ఫుడ్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల పండిస్తున్నారు. చాలామందికి ఇప్పుడు వీటి మీద ఆసక్తి వచ్చింది. ఈ సూపర్ ఫుడ్‌ని విశ్వవ్యాప్తంగా కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ మరియు నెదర్లాండ్స్ లో దీనిని పండించడం జరుగుతోంది.

Health Benefits Of Teff Grainఇక మన భారత్ లో కూడా ఇవి ప్యాకింగ్ చేసి వస్తున్నాయి. ఇప్పుడు మనకు మెట్రో సిటీస్ నుంచి టౌన్స్ లో కూడా దొరుకుతున్నాయి. అలాగే ఆన్ లైన్ గ్రాసరీ వెబ్ స్టోర్లలో దొరుకుతున్నాయి. ఇక ఇందులో కాపర్, ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అథ్లెట్స్ పరిగెత్తే వాళ్ళు దీనిని ఎక్కువగా తీసుకుంటారు. టెఫ్ లో ప్రోటీన్స్ మరియు మినరల్స్ ఉంటాయి. బాడికి కావలసిన ప్రోటీన్ కంటెంట్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది.

మొక్కల నుంచి లభించే ఈ టెఫ్ లో అధికంగా పోషక విలువలు ఉంటాయి. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, జింక్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. ఇతర ధాన్యాలతో పోల్చుకుంటే ఈ టెఫ్ లో అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి. ఇక ఫైబర్ కూడా ఇందులో పుష్కలంగా ఉంది. చెప్పాలంటే గోధుమలు, బార్లీ కంటే కూడా టెఫ్ చాలా ఉత్తమమైనది. ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. అందుకే గోధుమకంటే ఇది ఉత్తమం.

మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా అన్నంకి బదులుగా రోటిలను తయారు చేసుకొని తింటుంటారు. ఈ విధంగా మధుమేహంతో బాధపడే వారు టెఫ్ తో చేసిన రోటీలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో ఎక్కువగా ఫైబర్,తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సరైన క్రమంలో ఉంచడానికి దోహదపడతాయి.

కాబట్టి మధుమేహంతో బాధపడే వారు టెఫ్ తో తయారు చేసుకునే రోటీలను ఎక్కువగా తీసుకోవటంవల్ల వారి శరీరంలో చక్కెర స్థాయి సాధారణ స్థితిలో ఉంటాయి. దీన్ని పిండిగా చేసుకొని రొట్టెలుగా కాల్చుకొని తీసుకోవచ్చు. లేదంటే గటకలా చేసుకొని కూడా తినొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్లు కూడా టెఫ్ ను తినొచ్చు. దీనిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది.

ముఖ్యమైన అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. టెఫ్ ను తినాల్సిందే. గోధుమలు, బార్లీ కంటే కూడా టెఫ్ చాలా ఉత్తమమైనది అని నిపుణులు కూడా చెబుతున్నారు. చపాతీలు చేసుకొని కానీ.. దోసెలుగా చేసుకొని కానీ.. బ్రెడ్, కుకీస్ గా, కేక్ గా కూడా టెఫ్ ను చేసుకొని తినొచ్చట. మీకు ఎలా ఇష్టంగా ఉంటే.. అలా చేసుకొని వాడుకోవచ్చు.

 

Exit mobile version